బీఆర్ఎస్ పార్టీ నుండి కవితను సస్పెండ్ చేయడంతోనే కవిత రియాక్షన్ ఎలా ఉంటుందా అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూశారు. పార్టీ నుండి సస్పెండ్ చేయడం గురించి కవిత ఏం మాట్లాడుతుంది..ఎవరిపై ఎలాంటి కామెంట్లు చేస్తుంది.. తనని ఏమంటుంది అనే దాని మీద ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది. కానీ ఫైనల్ గా కవిత ప్రెస్ మీట్ పెట్టి తనని పార్టీ నుండి సస్పెండ్ చేసిన పర్వాలేదు. కానీ హరీష్ రావు నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటూ సలహాలు సూచనలు ఇచ్చింది. అంతేకాదు ఎమ్మెల్సీ పదవీకి కూడా రాజీనామా చేసి ప్రజల్లోనే ఉంటాను అంటూ చెప్పింది.అలాగే కాస్త సింపతీ క్రియేట్ చేసే పని కూడా చేసింది. ఒక మహిళను అలాగే మీ చెల్లిని విమర్శించారు. నా చుట్టూ కుట్రలు జరుగుతున్నాయి.

అయినా కూడా కేటీఆర్ అన్న నాకు ఫోన్ చేసి ఎందుకు ప్రశ్నించలేదు. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు. నీ సమస్య ఏంటి అని అడగలేదు. ఒక్కసారైనా ఫోన్ చేసి మాట్లాడాలి కదా అంటూ కేటీఆర్ ని విమర్శించింది. అలాగే మా ఫ్యామిలీ ముక్కలు కావడానికి కారణం హరీష్ రావు, సంతోష్ రావులనే ఆరోపించింది. అంతేకాకుండా కాళేశ్వరంలో సంతోష్ రావు హరీష్ రావులే అవినీతి చేశారని,వారి ఇంట్లో బంగారం ఉంటే సరిపోదు బంగారు తెలంగాణ కావాలి అని సంచలన వ్యాఖ్యలు చేసింది.అంతేకాదు సంతోష్ రావు కేవలం కాళేశ్వరం విషయంలోనే కాదు స్టార్ సెలబ్రిటీలు అయినటువంటి ప్రభాస్ చిరంజీవి లను కూడా మోసం చేశారంటూ సంచలన ఆరోపణలు చేసింది.  అయితే ప్రభాస్ చిరంజీవి లు రాజకీయాల్లోకి రాలేదు. వాళ్ళనెలా మోసం చేస్తారని మీకు డౌట్ రావచ్చు.

ఇక ఈ విషయం గురించి కవిత ఏం చెప్పిందంటే.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో ఎంతోమంది సెలబ్రిటీలు మొక్కలు నాటడం స్టార్ట్ చేసి వేరే వాళ్ళకి ఛాలెంజ్ విసిరారు. అలా ఎంతో మంది సెలబ్రిటీలు ఈ మొక్కలు నాటడంలో కీలక పాత్ర పోషించారు.అలా చిరంజీవి,ప్రభాస్ వంటి సెలబ్రిటీలతో మొక్కలు నాటించి ఆ అడవినే కొట్టేయాలని చూశాడు సంతోష్ రావు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు సంతోష్ రావు చెవిలో జోరీగా లాంటివాడని,కూరలో ఉప్పు లాంటి వాడు అంటూ విమర్శించింది. ఇక ఏ పని చేసినా కూడా దాన్ని చెడగొట్టడంలో సంతోష్ రావు ముందు ఉంటాడని కవిత తీవ్ర ఆరోపణలు చేసింది.ప్రస్తుతం కవిత హరీష్ రావు, సంతోష్ రావు లని టార్గెట్ చేస్తూ ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: