ఢిల్లీతెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ (TSA) ఆధ్వర్యంలో రామజస్ కాలేజీ గ్రౌండ్స్, ఢిల్లీ యూనివర్సిటీలో బతుకమ్మ 2025 ఘనంగా నిర్వహించారు. దాదాపు నాలుగు వేల మందికి పైగా తెలుగు విద్యార్థులు, కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ ఆభరణమైన ఈ పూల పండుగను ఘనంగా జరుపుకున్నారు. దసరా పండుగ సందడితో ఈ వేడుక దిల్లీలో సాంస్కృతి, ఆనందం, రంగులతో కళకళలాడింది ..


ఈ వేడుకకు ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా హాజరై, బతుకమ్మ పూజలో పాల్గొని తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించారు. ఎంట్రప్రెన్యూర్, ఫిలాంత్రఫిస్ట్ శ్రీమతి ఉపాసన కామినేని కొణిదెల ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో వేదిక పంచుకున్న ఉపాసన కొణిదెల దీపప్రజ్వలన చేసి, ప్రసంగం చేశారు .. “బతుకమ్మ పూల పండుగ మాత్రమే కాదు ఇది మహిళా శక్తి, సమాజ బలం, సృజనాత్మకతకు ప్రతీక. దసరా  స్ఫూర్తికి అనుసంధానమై ఉత్సాహం, ఆనందం, విజయోత్సవం. ఢిల్లీలో యువత ఈ సంప్రదాయాన్ని ఇంత గర్వంగా కొనసాగిస్తుండటం చూడడం గర్వకారణం .. .


అలాగే, తెలంగాణ సంస్కృతిని అంతటా వ్యాప్తి చేసి, గౌరవంగా ఆచరించినందుకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారికి ఉపాసన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్య అతిథిగా ఉపాసన కొణిదెలకు తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే శాలువా, జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. ఆమె హాజరుతో 4,000 పైగా విద్యార్థులు, సందర్శకులు తెలుగు సంస్కృతి ఢిల్లీలో ఇంత విస్తృతంగా ప్రతిధ్వనించడం చూసి ఆనందించారు. .


TSA అధ్యక్షుడు వివేక్ రెడ్డి, సలహాదారు కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో సంప్రదాయ పూజ, బతుకమ్మ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉత్సవ వైభవాన్ని మరింత పెంచాయి .. దసరా పండుగ సమయంతో కలసి ఈ బతుకమ్మ వేడుక సంప్రదాయం, ఐక్యత, సాంస్కృతిని ప్రతిబింబిస్తూ, ఢిల్లీలోని తెలుగు విద్యార్థుల ఐక్యమత్యాన్ని TSA మరోసారి బలోపేతం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: