బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార పక్షం అయిన ఎన్డీఏ కూటమిలోనూ, ప్రతిపక్ష కూటమిలోనూ అంతర్గత ఉద్రిక్తతలు బాగా పెరిగిపోతున్నాయి. సీట్ల పంపిణీ ప్రక్రియ పూర్తయ్యాక కేవలం రెండు రోజులు కూడా గడవకముందే, ఎన్డీఏ కూటమిలో గందరగోళం తీవ్ర స్థాయికి చేరుకుంది. అధికార కూటమిలో భాగమైన చిన్న పార్టీల నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక మర్చా పార్టీ, అలాగే జితేంద్ర మాంఝీ ఆధ్వర్యంలోని హిందుస్తానీ అవామీ మోర్చా నాయకులు, సీట్ల కేటాయింపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పార్టీలు తాము తగిన ప్రాధాన్యత పొందలేదని, బీజేపీ–జేడీయూ తమను పక్కనబెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి.

ఇక అధికార పెద్ద పార్టీల్లోనూ పరిస్థితి అంత తేలికగా లేదు. జేడీయూలోని పలువురు కీలక నేతలు, బీజేపీ సీనియర్ లీడర్లు కూడా అసంతృప్తిని బయటపెడుతున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న చిరాగ్ పస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) కు 29 సీట్లు కేటాయించడంపై జేడీయూ నేతల్లో మండిపాటు తారస్థాయికి చేరింది."గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచిన పార్టీకి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి? ఇది ఎలాంటి వ్యూహం?" అంటూ నితీశ్ కుమార్ నేతృత్వంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొందరు నేతలు మరింతగా ముందుకెళ్లి, “నితీశ్ గారికి అసలు రాజకీయ దృష్టి ఉందా? ఇలా సీట్లు పంచడం వల్ల ఎన్డీఏలో గందరగోళం తప్పదని ఆయనకు తెలియదా? ప్రధాని మోడీ ఈ వ్యవహారంపై కనీస బాధ్యత వహించాలా లేదా?” అంటూ కఠిన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇక మరోవైపు, రాజసభ ఎంపీ కుష్వాహా స్వాగ్ పర్సనల్‌గా కూడా ఈ సీట్ల కేటాయింపుపై అసంతృప్తిని ప్రకటించడంతో పార్టీ లోపలే చీలిక స్పష్టమవుతోంది. సోషల్ మీడియాలో కూడా “ఎన్డీఏలో అన్నీ బాగానే లేవు”, “బీహార్‌లో కూటమి పగుళ్లు మొదలయ్యాయి” అంటూ హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.బీహార్ అసెంబ్లీ మొత్తం 243 సీట్లతో ఉంది. ఎన్నికల కోసం ఎన్డీఏ కూటమి చేసిన సీట్ల పంపిణీ ప్రకారం —బీజేపీకి 101 సీట్లు,జేడీయూకు 101 సీట్లు,లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి 29 సీట్లు,హిందుస్తానీ అవామీ మోర్చా (సెక్యులర్)కి 6 సీట్లు,రాష్ట్రీయ లోక మోర్చా పార్టీకి 6 సీట్లు కేటాయించబడ్డాయి. ఈ పంపిణీతోనే పెద్ద వివాదం మొదలైంది. చిరాగ్ పస్వాన్ పార్టీకి 29 సీట్లు ఇవ్వడాన్ని జేడీయూ నేతలు “తప్పు నిర్ణయం”గా వ్యాఖ్యానిస్తున్నారు. “ఒక సీటు గెలిచిన పార్టీకి ఇంత ప్రాధాన్యత ఇవ్వడం బీజేపీ యొక్క దుర్వ్యూహం. ఇది నితీశ్ గారి నాయకత్వాన్ని బలహీనపరచడానికి చేసిన ప్రయత్నం” అని కొందరు నేతలు ఆగ్రహంతో అంటున్నారు.

దీంతో, బీహార్ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఎన్డీఏలో అనుసంధానం కూలిపోతుందా? లేదా ఎన్నికల ముందే సర్దుబాటు జరుగుతుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాలను కుదిపేస్తున్నాయి. మరోవైపు చిరాగ్ పస్వాన్ పేరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆయన రాజకీయ చాతుర్యం, మోడీతో ఉన్న సంబంధం గురించి చర్చలు చెలరేగుతున్నాయి.మొత్తం మీద, బీహార్‌లో ఎన్నికల వేడీ మొదలుకాకముందే, అధికార ఎన్డీఏ కూటమిలో అంతర్గత తగాదాలు తెరపైకి వచ్చాయి. ఈ పరిణామాలు ఎన్నికల ఫలితాలపై ఏ విధమైన ప్రభావం చూపుతాయో అన్నదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: