కర్నూలు జిల్లాలో నిన్న జరిగినటువంటి రోడ్డు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఇందులో ఉండే ప్రయాణికుల్లో చాలామంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. అయితే వి కావేరి ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సులో వీరు ప్రయాణం చేస్తూ ఒక్కసారిగా బస్సు ప్రమాదం అవ్వడంతో చాలామంది అక్కడికక్కడే మరణించారు. నిజానికి ఆ బస్సులో ఎంతమంది ఉన్నారు ఎంతమంది సురక్షితంగా బయటపడ్డారు. ఎంతమంది మరణించారు.. అసలు ఈ ప్రమాదానికి అసలు కారణమేమిటో ఇప్పుడు చూద్దాం.. హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి వేమూరి ట్రావెల్స్ కు చెందినటువంటి ప్రైవేట్ ఏసి స్లీపర్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అగ్ని ప్రమాదం బారిన పడింది. ఈ ఘటనలో మొత్తం 19 మంది సజీవ దహనం అయ్యారు. మరి కొంతమంది చాకచక్యంగా అద్దాలు పగలగొట్టి మరీ బయటకు వచ్చారు. ఇందులో నుంచి 22 మంది తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. 

అయితే బస్సు ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగిపోయాయి. కొందరైతే మంటలు బట్టలకు అంటినా కానీ బయటకు దూకేశారు. ఇక మరణించిన వారిలో ఆరుగురు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారైతే మిగిలిన ఏడుగురు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు. మరో ఆరుగురు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు. అయితే ఇంతటి ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం చాలామంది బైకును బస్సు ఢీకొనడం వల్లే జరిగిందని అనుకున్నారు. కానీ తాజాగా బస్సులోని మృతదేహాలను దానికి అంటిన మంటలను బట్టి ఫోరెన్సిక్ నిపుణులు కీలక విషయాలను బయటపెట్టారు. అయితే ఆ ట్రావెల్స్ బస్సులో సెల్ ఫోన్ బ్యాటరీలు పేలడం వల్లే అంతటి అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు, నిపుణులు అన్నారు. హైదరాబాద్ కు చెందినటువంటి మంగనాథ్ అనే వ్యాపారి 44 లక్షల విలువైన రియల్ మీ కంపెనీ సెల్ఫోన్ బాక్స్ లను బస్సులో పార్సిల్ చేశారు.

ఈ మొబైల్స్  బెంగళూరులోని ఫ్లిప్కార్ట్ సంస్థకు చేరాలి. అక్కడి నుంచి వివిధ కస్టమర్లకు సరాఫరా అవుతాయి. అయితే బస్సులో కొద్దిపాటి మంటలు రాగానే అవి సెల్ఫోన్లకు అంటుకొని ఆ బ్యాటరీలు పేలి విపరీతమైనటువంటి మంటలు ఎగిసిపడి ప్రమాదం జరిగిందని అంటున్నారు. అంతేకాకుండా ఆ మంటల్లో చాలా బ్యాటరీలు పేలే శబ్దాలు కూడా మాకు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఘటన చాలా బాధాకరం. ఇందులో డ్రైవర్, క్లీనర్ కాస్త చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికులను అలర్ట్ చేసి డోర్ ఓపెన్ చేసి ఉంటే మాత్రం ఇంత మంది చనిపోయి ఉండేవారు కాదని  నిపుణులు అంటున్నారు. ప్రమాదానికి మరో కారణం డ్రైవర్ నిర్లక్ష్యం అని కూడా తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: