ఇంకా పెరుగుతుంది మరొక కొద్ది రోజులలో రూ .2 లక్షల వరకు చేరుతుంది అంటూ వినిపించడంతో చాలామంది ఎక్కువగా కొనేశారు. అయితే ఇది అంతర్జాతీయంగా జరిగింది కాబట్టి ప్రచారం చేయడంలో తప్పులేదు. కానీ తగ్గుతున్నప్పుడు మాత్రం ఎక్కడ హైలెట్ చేయలేదు, వాటి మీద డిబేట్లు పెట్టలేదు ,ఫోకస్ చేయలేదు. ప్రస్తుతం ధరల విషయానికి వస్తే తులం బంగారం రూ.1,21,400 రూపాయల నుంచి అత్యధికంగా రూ.1,24,239 బంగారం 24 క్యారెట్ల వరకు బంగారం ధర ఉన్నది. అదే సందర్భంలో సిల్వర్ 1,47,151 నుంచి కేజీ రూ.1,48,458 వరకు కొనవచ్చు. కానీ ఈ విషయాన్ని మాత్రం ప్రచారం చేయడం లేదు.
తగ్గిన వాటిని అటు మీడియా కానీ, పేపర్, అంతర్జాతీయ స్థాయిలో ఫోకస్ చేయలేదు. పెరిగిన వాటిని మాత్రమే హైలెట్ చేస్తున్నారు. తగ్గిన వాటిని ప్రచారం చేయకపోవడంతో దీని ద్వారా బంగారం వ్యాపారులకు మీడియా అంతా కూడా లాభం చేకూర్చేలా చేస్తోందంటూ పలువురు నిపుణులు తెలియజేస్తున్నారు. తగ్గిన వాటిని కూడా హైలెట్ చేస్తూ చూపించడం వల్ల ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుంది. దీంతో బంగారం డిమాండ్ కూడా తగ్గుతుందనే విధంగా నిపుణులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి