ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. మనందరికీ తెలిసిందే, మరి కొద్ది రోజుల్లోనే బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 6, నవంబర్ 11 రెండు దశలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.   ఈ క్రమంలో తాజాగా జేడీయూ పార్టీ తీసుకున్న నిర్ణయం బీహార్ ప్రజలకు షాకింగ్‌గా మారిపోయింది. ఎన్నికల ముందు జేడీయూలో కలకలం చెలరేగింది. రాష్ట్రంలో అధికార పార్టీ అయిన జేడీయూ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీకి చెందిన ఒక్కరు కాదు, దాదాపు 11 మందిని సస్పెండ్ చేసి పక్కన పెట్టింది. దీంతో బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో ఇది పెద్ద సంచలనంగా మారింది.సస్పెండ్ అయిన వారిలో మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. వాస్తవానికి జేడీయూ తీసుకున్న ఈ నిర్ణయం పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను బయటపెట్టిందని చెప్పాలి. ఈ బహిష్కరణలపై అధికారిక ప్రకటనను పార్టీ రాష్ట్ర కార్యదర్శి చందన్ కుమార్ విడుదల చేశారు.


సస్పెండ్ అయిన వారిలో మాజీ శాసన సభ్యులు సంజయ్ ప్రసాద్, వరహరి, మాజీ ఎమ్మెల్యే శ్యామ్ బహదూర్ సింగ్, మాజీ శాసన సభ్యుడు రణవిజయ్ సింగ్‌లతో పాటు మరికొందరు ప్రముఖులు కూడా ఉన్నారు. వీరిని ఎందుకు సస్పెండ్ చేశారనే దానిపై ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతోంది.ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న కారణంతో వీరిని బహిష్కరించినట్లు తెలుస్తోంది. మరోవైపు, సస్పెండ్ అయిన వారిలో కొందరికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కదనే సంకేతాలు వచ్చాయని, అందుకే వారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని హైకమాండ్ కి పక్క సమాచారం అందడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది అని చెబుతున్నారు.



దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు పార్టీ వర్గాలు స్పష్టమైన సంకేతాలు పంపించగా, వెంటనే ఆ 11 మందిని సస్పెండ్ చేసినట్లు సమాచారం.  దీని బట్టి జేడీయూ భావజాలానికి, నాయకత్వ విధానాలకు విధేయులైన వారే పార్టీలో కొనసాగుతారని  పార్టీ స్పష్టం చేస్తోంది. ఈ నిర్ణయంపై కొందరు ఘాటుగా స్పందిస్తున్నారు. “ఇది జేడీయూ చూపిన తొందరపాటు చర్య అని కొందరు. దీనికి పార్టీ ఫ్యూచర్ లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది,” అని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: