ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి జిల్లా టిడిపి రాజకీయాలలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు టిడిపి పార్టీకి మైనస్ గా మారుతున్నాయి. ముఖ్యంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, విజయవాడ ఎంపీ చిన్ని పై చేసిన ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి. అయితే నేపథ్యంలోనే ఈ వివాదాంలో అధిష్టానం జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు వినిపిస్తోంది. ఈ విషయం పైన రంగంలోకి దిగిన కేసినేని చిన్ని ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా తన రూటు మార్చి ఉమ్మడి జిల్లాలో తన బలాన్ని చాటుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది ఎంపీ చిన్ని.



అధికార పక్షంలో విపక్షంలో మారారు ఎమ్మెల్యే కొలికపూడి, గెలిచినప్పటి నుంచి కూటమికి కొరకరాని కొయ్యల తయారయ్యారు. ఒకదాని తర్వాత మరొక వివాదంతో కొలికపూడి అధిష్టానానికి తలనొప్పిగా మారారు. గతంలో గుంతల రోడ్డు విషయంలో నిరసనకు దిగగా, ఆ తర్వాత తిరువూరులో కమర్షియల్ బిల్డింగులు కూల్చివేత, మద్యం మాఫియా, ఇసుక వంటి వాటిపైన కూడా మాట్లాడారు. ఎంపీ కేసినేని చిన్ని గత ఎన్నికలలో తిరువూరు టిక్కెట్ కోసం రూ .5కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని ఆరోపణలు చేశారు. కోటి పది లక్షల రూపాయలు ఇచ్చానంటూ ఆధారాలను కూడా బయటపెట్టారు.


తిరువూరు గ్రౌండ్ లెవెల్లో చూస్తే మాత్రం ఎమ్మెల్యే పైన టిడిపి క్యాడర్ కోపంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో కొంతమంది నేతలు అసలు నువ్వు ఎవరు నాలుగు జతల బట్టలతో తిరువూరుకి వచ్చావు చంద్రబాబు చెబితే గెలిపించాము అంటూ కొలికపూడి తిరువూరు కేడర్ తీవ్రస్థాయిలో టిడిపి నేతలు ఫైర్ అవుతున్నారు.  టిడిపి అధ్యక్షులు మానికొండ రామకృష్ణ మాట్లాడుతూ.. అసలు పార్టీతో కొలికపూడికి సంబంధం లేదని స్టేట్మెంట్ వస్తే ఒక గంట కూడా  తిరువూరులో తిరగనివ్వమంటూ  వార్నింగ్ ఇస్తున్నారు. అంతేకాకుండా కొలికపూడి టార్గెట్ చిన్ని కాదని, టిడిపి అంటూ తెలిపారు రామకృష్ణ. అలాగే కేశినేని నానిని జెంటిల్మెన్ అంటారా అంటూ ఫైర్ అయ్యారు. కొలికపూడి పార్టీ చెందాలు తీసుకోవడమే  కాకుండా, అక్రమాలకు పాల్పడ్డారు అంటూ ఫైర్ అయ్యారు. దమ్ముంటే కొలికపూడి దంపతుల బ్యాంకు స్టేట్మెంట్ బయట పెట్టాలంటూ డిమాండ్ చేశారు. మొత్తానికి కొలికపూడికి చెక్ పెట్టడానికి, చంద్రబాబు అవసరం లేదు, మేము చాలు అంటూ తిరువూరు క్యాడర్ ఫిక్స్ అయ్యిందా అన్నట్టుగా కనిపిస్తోంది. తిరువూరు స్థానిక నేతలతోనే కొలికపూడికి అడ్డుకట్టు వేసేందుకు అధిష్టానం  ప్లాన్ చేసిందా అనే విధంగా వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: