'ఇండీ' (INDIA) కూటమికి అత్యంత కీలకమైన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ఇప్పుడు ప్రధానంగా ఆర్జేడీ నాయకుడు, prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ భుజాలపైనే నడుస్తోంది. కూటమి మొత్తానికి ఆయనే ఏకైక ప్రచార సారధిగా మారి బీహార్ అంతటా విస్తృతంగా పర్యటిస్తున్నారు. తేజస్వీ కష్టం చూసిన రాజకీయ వర్గాలు, సాధారణ ప్రజల్లో ఒకే ప్రశ్న పదే పదే వినిపిస్తోంది: "రాహుల్ గాంధీ ఎక్కడ?" రెండు నెలల క్రితం 'ఓటర్ అధికార్ యాత్ర' చేసి వెళ్లిన కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మళ్లీ బీహార్ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టలేదు. ఇది బీహార్ రాజకీయాల్లో, సామాన్యుల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. కాంగ్రెస్ నిర్లక్ష్యం: గత వైఫల్యం పునరావృతమా? .. ఎన్డీఏ కూటమి తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విస్తృతంగా ర్యాలీలు నిర్వహిస్తుండగా, నితీష్ కుమార్ కూడా ప్రచారం చేస్తున్నారు.
 

కానీ, 'ఇండీ' కూటమి తరపున ఒక్క తేజస్వీ యాదవ్ మాత్రమే ప్రచార బాధ్యతను మోస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 61 స్థానాల్లో పోటీ చేస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ తనకు కేటాయించిన సీట్లలో అత్యధిక మెజారిటీని గెలవడం కీలకం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70కిపైగా సీట్లు తీసుకుని అతి తక్కువ స్థానాల్లో గెలవడంతో మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఈసారి కూడా రాహుల్ గాంధీ నిర్లక్ష్యం కారణంగా అలాంటి పరిస్థితే వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్న వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రచారానికి దూరంగా ఉండటానికి కారణమేమిటి? .. రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటానికి గల కారణం రాజకీయ వర్గాలకు అంతు చిక్కడం లేదు. 'అడిగినన్ని సీట్లు ఇవ్వలేదనో' లేక 'లాలూ ప్రసాద్ యాదవ్ తమ రాజకీయాలను పడనీయలేదనో' ఆయన ఫీలవుతున్నారేమో స్పష్టత లేదు.

 

నిజానికి, రాహుల్ గాంధీ మొదట్లో బీహార్‌లో 'ఓట్ల చోరీ' అంశాన్ని ఎన్నికల అజెండా చేద్దామనుకున్నారు. కానీ ఆ అంశంలో నిజాయితీ లేకపోవడంతో అది పెద్దగా పట్టించుకోబడలేదు. ప్రస్తుతం బీహార్ ఎన్నికల అంశం కులగణన (Caste Census) కాదు. ప్రధానంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, యువత వలస పోకుండా ఏం చేయాలనే అంశాలు రాజకీయ చర్చల్లో కీలకంగా మారాయి. రాహుల్ గాంధీ తనకిష్టమైన 'పాత' అంశాలను పక్కన పెట్టి, ఈ కొత్త అంశాలపై ప్రచారం చేయడానికి ఆసక్తి చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాహుల్ 'పార్ట్ టైమ్' రాజకీయాలతో కాంగ్రెస్‌కు నష్టం .. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు కుంచించుకుపోవడానికి రాహుల్ గాంధీ శుష్క నాయకత్వమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆయన చేసే పార్ట్ టైమ్ రాజకీయాలు, ప్రజలతో నిరంతరం టచ్ ఉండని వ్యూహాలు ఆయన్ను వైఫల్య నాయకుడిగా నిలబెట్టాయి. తన పనితీరుతో మెరుగైన నేతగా, విజయాలు తెచ్చిపెట్టగలనని రాహుల్ బలంగా అనుకోవడం లేదు. ఒకవేళ అలా అనుకుని ఉంటే, అత్యంత కీలకమైన బీహార్ ఎన్నికలను ఇంత ఆషామాషీగా తీసుకుని ఉండేవారు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: