గత మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో మొంథా తుఫాన్ ఎఫెక్ట్ చూపుతోంది. దీంతో ప్రభుత్వం కూడా ప్రజలని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ తెలియజేశారు. ముఖ్యంగా ఎవరూ కూడా బయటికి రాకూడదని ఆదేశాలను జారీ చేశారు. ఇప్పుడు తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తుఫాన్ మరింత తీవ్రంగా మారింది. దీంతో 6 గంటలలో 17k. M. వేగంతో ఈ తుఫాను కదులుతోంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 120 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 110, విశాఖపట్నంకి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా వాతావరణ శాఖ గుర్తించింది.


కాకినాడ, మచిలీపట్నం మధ్య మొంథా తుఫాన్ తాకింది. తీరం దాటడానికి మరో 2లేదా3 గంటల సమయం పడుతుంది. దీంతో ఈ ప్రభావంతో కోస్తా వెంబడి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షాలు ఉండబోతున్నాయి. ప్రజల సురక్షితంగానే ఇంట్లోనే ఉండాలని అవసరమైతే తప్ప ఎవరూ బయటికి రాకూడదంటూ వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తోంది .తుఫాను ప్రభావిత ప్రాంతాలలో కూడా ఇప్పటికే సహాయక చర్యలలో పాల్గొనాలని అధికారులకు ఉత్తరులను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.

ఈరోజు రాత్రికు కాకినాడ సమీపంలో ఈ తీరం దాటి అవకాశం ఉన్నది అంటూ తెలియజేస్తోంది వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలలో అన్ని విద్యాసంస్థలను కూడా సెలవులుగా ప్రకటించారు. తాజాగా ఇంటర్ బోర్డు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉండే జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 27 నుంచి 31 వరకు సెలవులుగా ప్రకటించారు. తుఫాను ప్రభావిత జిల్లాలలో భారీ వర్షాలు నేపథ్యంతో రహదారుల పైన ఆంక్షలు విధించడమే కాకుండా, జాతీయ రహదారులలో రాత్రి 7 గంటల నుంచి వాహనాలు తిరగకూడదని ఆదేశాలను జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయట ఎవరూ కూడా ప్రయాణం చేయవద్దంటూ అధికారులు ఉత్తరులను జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: