 
                                
                                
                                
                            
                        
                        అలాగే మరొకవైపు తుఫాను వల్ల ఏపీలో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ .5 లక్షల రూపాయలు నష్టపరిహారం అందించాలంటూ ఆదేశాలను జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా రైతుల సాగు చేసుకున్న పంటలు కూడా పూర్తిగా దెబ్బ తిన్నాయి..మొంథా తుఫాను కారణంగా భారీ వర్షాల కారణంగా వరి పంటకు తీవ్ర నష్టం కలిగించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో 304 మండలాలలో, 1800 పైగా గ్రామాలలో పంట నష్టం వాటిలిందని అంచనా వేస్తున్నారు. మొత్తం 87 వేల హెక్టార్లలో ఈ పంట నష్టం జరిగినట్లు అధికారుల అంచన వేస్తున్నారు.
59 వేల హెక్టార్లలో వరి, మొక్కజొన్న , మినుము పంట భారీగా నష్టం వచ్చిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 78,796 మంది రైతులు సాగుచేసిన పంటలు చాలా దెబ్బతిన్నాయని అంచనా వేస్తున్నారు. అలాగే 42 పశువులు మృతి చెందాయని తెలియజేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి పరిశీలించిన తర్వాత ఈ సంఖ్యలు పెరిగే అవకాశం ఉందని కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా తూర్పుగోదావరి, ప్రకాశం, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లా, వైయస్సార్ కడప, కోనసీమ, ఏలూరు ఇటువంటి ప్రాంతాలలో పంటలు చాలా దెబ్బతిన్నాయి. ఇందులో వరి ,మొక్కజొన్న, సజ్జ, రాగి, పసుపు, అరటి, ఉల్లి, కంది వంటి పంటలు ఉన్నాయట.
 
             
                             
                                     
                                             క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి