 
                                
                                
                                
                            
                        
                        గ్రేటర్ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో అటు సామాజిక వర్గాల ఓట్లు ఇటు మతపరమైన ఓట్లు కేలకం కావడంతో కాంగ్రెస్ ఆయా వర్కర్ల ఓట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓట్లు సుమారు 60 నుంచి 70 వేలకు పైగానే ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. పెద్ద సంఖ్యలో ఉన్న వారి ఓటు బియ్యం కూడా తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వర్గాల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలు తమ అభ్యర్థి గెలిచిన తర్వాత చేసే పనులపై హామీలు ఇస్తున్నారు.
తాజాగా క్రికెటర్ కాంగ్రెస్ సీనియర్ నేత మహమ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఖాయం కావడంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుందన్న చర్చ రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. కులాల వారీగా ఓట్లు దక్కించుకునేందుకు ఆయా నేతలతో కాంగ్రెస్ లీడర్లు కీలక సమావేశంలో నిర్వహిస్తున్నారు. తాజాగా కమ్మ సంఘాల నేతలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తమ మద్దతు కాంగ్రెస్కే ఉంటుందని వారు ముఖ్యమంత్రి కి హామీ ఇచ్చారు. పార్టీలోనూ నామినేటెడ్ పదవుల్లోనూ తమ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేయగా అందుకు రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఇటీవల క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనాన్ని కాంగ్రెస్ నిర్వహించింది. ప్రస్తుతం కార్తీకమాసం కావడంతో కులాల వారిగా వన భోజనాల కార్యక్రమాలు సైతం నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
 
             
                             
                                     
                                             క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి