తాజాగా JVC అనే ఒక ప్రముఖ సర్వే సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో ఎన్డీఏ కూటమికి 120 నుంచి 140 సీట్లు వస్తాయని, ఇందులో బిజెపి 70, జెడియూ 42 నుంచి 48 సీట్లు వస్తాయని, LJP 5 నుంచి7 సీట్లు, హెచ్ఏఎం 2 సీట్లు, ఆర్ఎల్ఎం ఒకటి లేదా రెండు స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది. అలాగే మహాఘట్ బంధం కూటమికి 93 నుంచి 112 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తోంది. అయితే ఇందులో ఆర్జెడి 69 నుంచి 78 స్థానాలు, కాంగ్రెస్ 9 నుంచి 17 స్థానాలు, సిపిఐ 12 నుంచి 14 స్థానాలు ఇతర పార్టీలకు ఒకటి లేదా రెండు సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో వచ్చినటువంటి జెన్ సూరజ్ పార్టీ కేవలం ఒక్క స్థానంలో గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. AIMIM, BSP ఇతర పార్టీలు 8 నుంచి 10 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తోంది జేవిసి సర్వే.
అలాగే మరొక సంస్థ లోక్ పాల్ కూడా ఎన్డీఏ పార్టీకి 105 నుంచి 114 సీట్లు వస్తాయని, మహాఘట్ బంధన్ కూటమికి 118 నుంచి 126 సీట్లు వస్తాయని, ఇతరులు 2 నుంచి 5 సీట్లు గెలిచే అవకాశం ఉందని తెలియజేసింది. మొత్తానికి సర్వేలతోనే బీహార్ ఎలక్షన్స్ కు సంబంధించి పోటీనే సంచలనంగా మారుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి