కాంగ్రెస్ వ్యూహం – వైసీపీతో సాఫ్ట్ పొలిటిక్స్? .. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, దక్షిణ రాష్ట్రాల్లో బలపడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఏపీలో ప్రత్యక్ష బలం తక్కువైనా, జాతీయ స్థాయిలో “ఇండియా కూటమి”ని బలోపేతం చేయాలనే దృష్టితో వైసీపీతో వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోందని అనుకుంటున్నారు. కమ్యూనిస్టు పార్టీలతో కలసి దేశవ్యాప్తంగా పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, ఏపీలో కూడా అదే దిశగా కదులుతోందనే టాక్ వినిపిస్తోంది. ఇక వైసీపీ విషయానికొస్తే, జగన్ ఓటు బ్యాంక్ ఇప్పటికీ 40 శాతం పైగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజా ఆదరణ నిలకడగానే ఉండటంతో, కాంగ్రెస్ పార్టీ కూడా వైసీపీని నేరుగా దూకి విమర్శించే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల మౌనం కూడా కాంగ్రెస్ వ్యూహంలో భాగమనే భావన బలపడుతోంది.
బీహార్ ఫలితాలపై కాంగ్రెస్ భవిష్యత్ ఆధారపడుతోంది .. ఇక కాంగ్రెస్ పార్టీకి బీహార్ రాష్ట్రం కీలక మలుపు కాబోతోంది. అక్కడ “మహాఘట్ బంధన్” విజయం సాధిస్తే, జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి ఊపిరి వస్తుందని కాంగ్రెస్ పెద్దలు నమ్ముతున్నారు. ఆ ప్రభావం దక్షిణ రాష్ట్రాలపై, ముఖ్యంగా ఏపీలో కూడా పడుతుందని లెక్క వేస్తున్నారు. వైసీపీకి 2029 ఎన్నికలు చావో రేవో .. 2029 ఎన్నికలు వైసీపీకి జీవన మరణ ప్రశ్నగా మారబోతున్నాయి. జగన్ నేతృత్వంలో పార్టీ మరోసారి రాణించగలదా లేదా అన్నది అదే ఎన్నిక తేలుస్తుంది. ఇక కాంగ్రెస్ వ్యూహాత్మక మౌనం, కూటమి దూకుడు, జాతీయ రాజకీయ పరిణామాలు — ఇవన్నీ కలిపి ఏపీ రాజకీయ దిశను మార్చే అవకాశాలు ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి