- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే ఈ ఎన్నికలవేళ కొన్ని రాజకీయ పార్టీలలో సరికొత్త టెన్షన్ మొదలైంది. ఓట్ల కోసం ప్రధాన పార్టీలు రకరకాల ఎత్తులకు తెర‌లేపుతున్నాయి. మిక్సీలు , కుక్కర్లు , గ్రైండర్లు , బ్యాగులు ఇలా ఓట‌ర్ల ను ప్రసన్నం చేసుకునేందుకు కాదేదీ అనర్హం అంటున్నారు రాజకీయ నాయకులు. ఉప ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కొందరికి కుక్కర్లో మరికొందరికి మిక్సీలు తైలాలుగా ఇచ్చి ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఇళ్లల్లో వాడుకునే వస్తువులతో మహిళ ఓటర్లకు గాలం వేస్తున్నారు. షాపుల నుంచి లక్ష మిక్సిలు కుక్కర్లో కొంటున్నారని సమాచారం.


పోలింగ్ కు ముందే పంపిణీ చేసేందుకు వారంతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గోడ గడియారాలు పిల్లలకు స్కూల్ బ్యాగులు , లంచ్ బ్యాగులు , రకరకాల గిఫ్టు లు కూడా ఇచ్చి పిల్లలను యూత్ ను త‌మ వైపున‌కు తిప్పుకునే ప్లాన్ వేస్తున్నారట. పురుషులకు డబ్బు మద్యం బాటిల్లు .. బిర్యాని ఉండనే ఉన్నాయి. ఇలా మొత్తం ఫ్యామిలీని ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తహతలాడుతున్నారట. హోల్సేల్ వ్యాపారులతో డీల్ సెట్ చేసుకుని ఆయా వస్తువులను తరలించే పనిలో ఉన్నారట. ఇక డివిజన్ల వారీగా చోటామోటా నేతలకు చెందిన గోడౌన్లు లేదా ఇళ్ల లోకి వీటిని తరలించి అక్కడి నుంచి పోలింగ్ ఒకరోజు ముందు పంపిణీ చేయాలని పిక్స్ అయిపోయారట. ఓ వైపు తమ పార్టీ ఇమేజ్ వ్యక్తిగత ఇమేజ్ను నమ్ముకుంటూనే .. ఇలా ఓటర్లను రకరకాల రూపంలో ప్రలోభాలు పెట్టేందుకు అభ్యర్థులు రెడీ అవుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: