ఈ టైటిల్ చూసిన వారిలో చాలామందికి షాక్ తప్పదు. బాబు మంత్రులను మార్చేస్తున్నారా ? ఇది నిజమేనా అన్న చర్చల్లోకి అందరూ వెళ్లిపోతారు. ప్రభుత్వ పరంగా జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను చంద్రబాబు నియమించారు. వారికి కేలక బాధ్యతలు అప్పగించారు. జిల్లాల స్థాయిలో మంత్రులు , ఎమ్మెల్యేలు , అధికారులు సమన్వయం చేయడం తో పాటు ప్రజలకు మరింత మెరుగైన పాలన అందేలా వ్యవహరించాలి. గత కొన్నాళ్లుగా ఇన్చార్జి మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలను సరైన పద్ధతుల్లో నడిపించడం లేదని వారిపై కొద్ది రోజులు కిందట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మరోసారి ఇంచార్జ్ మంత్రులు వ్యవహారం పార్టీ వర్గాల్లో చర్చకి వచ్చింది.


ముఖ్యంగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. కొంతమంది ఇన్చార్జి మంత్రులు అసలు తమకు బాధ్యతలు అప్పగించిన జిల్లాలలో పర్యటించడం లేదని ... ఆయన ఓపెన్ గానే అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇన్చార్జి మంత్రులకు .. ఎమ్మెల్యేలకు ఇన్చార్జి మంత్రులకు ఆయా జిల్లాల మంత్రులకు కూడా గ్యాప్ పెరుగుతోందని పల్లా శ్రీనివాసరావు చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే ఇన్చార్జి మంత్రులకు చెబితే అది పరిష్కారం అయ్యే పరిస్థితి గతంలో ఉండేది.. అని ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని పల్లా నేరుగా చంద్రబాబు ముందు కుండ బద్దలు కొట్టేశారు.


కొన్ని జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను ఖచ్చితంగా మార్చి తీరాల్సిందేనని పల్లా శ్రీనివాసరావు చెప్పిన మాట. దీంతో చంద్రబాబు కూడా కచ్చితంగా ఈ సూచన తాను అమలు చేస్తానని ... లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఇన్చార్జి మంత్రుల వ్యవహారాన్ని పరిశీలించి మారుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కర్నూలు - కడప - అనంతపురం - ఎన్టీఆర్ - కృష్ణ - విశాఖ  - శ్రీకాకుళం - నెల్లూరు జిల్లాలకు సంబంధించిన ఇన్చార్జి మంత్రుల విషయంలో చంద్రబాబు అసంతృప్తితో ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మరి వీరందరినీ చంద్రబాబు మారుస్తారా ? కొందరిని మాత్రమే మారుస్తారా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: