ఆంధ్రప్రదేశ్లో జిల్లాల మార్పులు చేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం అధ్యయనం తుది దశకు చేరుకుంది. అతి త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక ఇవ్వాలని మంత్రులు నిర్ణయించారు. కొత్త జిల్లాలు , రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు సహా మండలాలు గ్రామాల్లో సరిహద్దులు మార్పులకు సంబంధించి తీసుకోవలసిన చర్యలను సిఫార్సు చేయనున్నారు. జిల్లాల పునర్విభజన సమస్యల పరిష్కారంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం బుధవారం సచివాలయంలో సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది. మదనపల్లి - మార్కాపురం కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలకు ఇప్పటికే ఆమోదముద్ర పడింది. మరో 7 - 8 కొత్త జిల్లాలు కావాలని ప్రజల నుంచి వినతులు రాగా వాటిని పరిశీలించారు. అలాగే పీలేరు - అద్దంకి - గిద్దలూరు - మడకశిర కొత్త రెవిన్యూ డివిజన్ల ఏర్పాటుపై చర్చించారు. ఏలూరు జిల్లాలోని నూజివీడు - కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలిపే ప్రతిపాదనలు ... అలాగే కైకలూరు నియోజకవర్గం కృష్ణ జిల్లాలో కలిపే ప్రతిపాదనలపై చర్చించారు.
అలాగే రెవెన్యూ డివిజన్లో కావాలని ఎక్కువ వినతులు వచ్చాయని తెలిపారు. అల్లూరు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 200 నుంచి 300 కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి వస్తుందని దీనిపై ఏఎస్ఆర్ జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక అథారిటీ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలపై చర్చించామన్నారు. పోలవరం ముంపు మండలాలను ఎక్కడ కలపాలి అనే విషయం పైన చర్చించారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి