“ కాంగ్రెస్ గెలిస్తే పథకాలు ఆగిపోతాయి, బుల్డోజర్లు వస్తాయి ” అంటూ భయాన్ని సృష్టించేలా ప్రచారం చేశారు. కేటీఆర్ స్వయంగా సమన్వయం చేస్తూ మాగంటి సునీతను కేవలం అభ్యర్థిగా కాకుండా “పార్టీ ప్రతిష్ట”గా ప్రొజెక్ట్ చేశారు. ఇది బీఆర్ఎస్‌కి జీవన్మరణ పోరాటం లాంటి ఎన్నిక. కంటోన్మెంట్ ఉపఎన్నికలో డిపాజిట్ కోల్పోయిన పార్టీకి, జూబ్లీహిల్స్‌లో ఓటమి అంటే పునాదులే కదిలినట్టే. అందుకే గెలుపే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని సర్వశక్తులు వినియోగించారు. కాంగ్రెస్ విషయానికి వస్తే, ఈ ఉపఎన్నిక రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుతో నేరుగా ముడిపడి ఉంది. ఆయన నేతృత్వం బలంగా నిలవాలంటే గెలుపు తప్పనిసరి. ఓటమి వస్తే పార్టీ సీనియర్ నేతలు మళ్లీ హైకమాండ్ చెంతకు వెళ్లి రేవంత్ ను పదవి నుంచి దించేయాలని ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. అంతర్గత విభేదాలు మళ్లీ తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే రేవంత్ ఈ ఎన్నికలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని తానే స్వయంగా ప్రచార రంగంలోకి దిగారు.
బీజేపీ మాత్రం ఈసారి “సైలెంట్ గేమ్” ఆడింది. బలమైన అభ్యర్థిని పెట్టే అవకాశం ఉన్నప్పటికీ, సావధానంగా వ్యవహరించింది. బండి సంజయ్ వంటి నాయకుల దూకుడు తగ్గించి, ప్రచారాన్ని నియంత్రించింది. తాము గెలవకపోయినా, ఫలితాల్లో ఇతరులకు నష్టం జరిగేలా రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోంది. మొత్తం మీద, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మలుపు తిప్పే అవకాశం ఉందని చెప్పాలి. బీఆర్ఎస్ గెలిస్తే తమకు తిరుగులేదని దూకుడుగా ప్రజల్లోకి వెళుతుంది. కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ స్థానం మరింత బలపడుతుంది. ఏ ఫలితం వచ్చినా, ఇది తెలంగాణ రాజకీయ సమీకరణాలను మలిచే కీలక ఎన్నికగా నిలవడం ఖాయం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి