బీహార్ ఎన్నికలలో కేవలం నితీష్ కుమార్ నాయకత్వంలోనే తాము ఎన్నికలలోకి వెళుతున్నామంటూ తెలిపారు అమిత్ షా. అయితే మళ్లీ సీఎం అవుతారనే విషయాన్ని మాత్రం ఎక్కడా చెప్పలేదు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ను బట్టి చూస్తే బిజెపి, జెడియూ పార్టీలలో అత్యధిక స్థానాలు బిజెపి సీట్లు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా నితీష్ కుమార్ కి సీఎం పదవిని అప్పజెప్పిన బిజెపి కానీ ఈసారి మాత్రం ఆ ఆలోచనలో లేదన్నట్లుగా ప్రచారం అయితే ఎక్కువగా వినిపిస్తోంది. గత కొద్ది రోజులుగా నితీష్ కుమార్ శారీరకంగా, ఆరోగ్య సమస్యలు, మానసికంగా బలంగా లేరనే విధంగా వినిపిస్తున్నాయి.
ఎన్డీఏ కూటమి 2025 ఎన్నికల కౌంటింగ్ లో ఇప్పటికి 189 స్థానాలలో ముందంజలో ఉంది. మహాఘాట్ బంధన్ కూటమి 50 స్థానాలలో ఉన్నది. 2020 బీహార్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి 125 స్థానాలు గెలచగా.. అందులో బిజెపి 74, జనతాదళ్ పార్టీ 43 సీట్లు, కూటమిలో కొన్ని పార్టీలు 4 స్థానాలు గెలిచాయి. కానీ అదే ఎన్నికలలో మహాఘాట్ బంధన్లో రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ 75 స్థానాలను గెలిచి అతిపెద్ద పార్టీగా నిలవడం గమనార్హం. ఆ సమయంలోనే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నితీష్ కుమార్ కి సీఎం పదవిని అప్పజెప్పారు బీజేపీ ఎన్డీఏ కూటమి. ఇలా ఏదో ఒక ఎన్నికలలో బిజెపితో లేదా RJD పార్టీలతో కలుస్తూ తానే సీఎం కుర్చీలో కొనసాగుతున్నారు సీఎం నితీష్ కుమార్. అయితే ఈసారి సీఎం పదవి నితీష్ కుమార్ కి దక్కదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి