2004లో రాధా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయనకు మంచి ఆరంభమైంది. యువ నేతగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచారు. చిన్న వయస్సులోనే ఎమ్మెల్యే కావడంతో ప్రజల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 2009 ఎన్నికల ముందు ఆయన తీసుకున్న నిర్ణయమే ఆయన రాజకీయ పతనానికి కారణమైంది. ప్రజారాజ్యం పార్టీలో చేరడం ఆయన చేసిన బిగ్ మిస్టేక్. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఇది తప్పు నిర్ణయమని హెచ్చరించినా, రాధా వారి మాట వినకుండా క్యాస్ట్ ఒత్తిళ్ల నేపథ్యంలో ప్రజారాజ్యంలో చేరారు. ఆ నిర్ణయం ఆయనకు చేదు అనుభవాన్నే ఇచ్చింది. తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అయినప్పటికీ రాధా కొంతకాలం రాజకీయాలకు దూరమయ్యారు.
తర్వాత వైసీపీలో చేరడం ఆయనకు మరో పెద్ద అవకాశం. 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలని పట్టుబట్టారు. కానీ పార్టీ మాత్రం మచిలీపట్నం ఎంపీ సీటు ఆఫర్ చేసింది. రాధా మాత్రం విజయవాడ సెంట్రల్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పట్టుబట్టారు. అందుకు జగన్ ఒప్పుకోలేదు. చివరకు రాధా వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. 2024లో కూడా ఆయనకు సీటు రాలేదు. రాధా టీడీపీలో చేరినా ఎలాంటి హామీలు తీసుకోకుండా బేషరతుగా చేరడం కూడా ఆయన చేసిన మరో వ్యూహపరమైన పొరపాటు అన్న చర్చలు రాజకీయ వర్గాల్లోనూ వినిపించాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా రాధాకు ఏ పదవి రాలేదు.. ఎలాంటి న్యాయం జరగలేదు. ఏదేమైనా రాధా వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడ నుంచి బయటకు వచ్చారు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ పదవి రాని పరిస్థితి. రాధా సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకోకపోతే రాజకీయంగా నష్టపోక తప్పని పరిస్థితి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి