ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 పదవ తరగతి విద్యా సంవత్సరానికి సంబంధించి పరీక్ష షెడ్యూల్ ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈసారి జరగబోయే పదవ తరగతి పరీక్షల నిర్వహణలో కొన్ని స్వల్ప మార్పులు చేసినట్లుగా తెలియజేస్తోంది. ఈ మేరకు పరీక్షలకు హాజరయ్యే జనరల్, ఓపెన్ స్కూల్, ఒకేషనల్ కేటగిర విద్యార్థులు ఈ మార్పులను దృష్టిలో పెట్టుకోవాలంటు విద్యాశాఖ సూచించింది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో అంతర్గత మార్కుల వెయిటేజ్ ఉంటుందంటూ తెలియజేశారు.

ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులు ,7 పేపర్ల విధానం ఉంటుందని తెలియజేశారు. ఒకటో భాష, ద్వితీయ భాష, గణితం, సోషల్ మీడియా సబ్జెక్టులకు ఒక్కొక్క పేపర్ ఉంటుందని ప్రతి పేపరు కూడా 100 మార్కులకు ఉంటుందంటూ తెలిపింది. అలాగే జనరల్ సైన్స్ సబ్జెక్టుకు (ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్) రెండు పరీక్షలు వేర్వేరు రోజులలో 50 మార్కుల చొప్పున ఒక్కో పరీక్ష ఉంటుందని తెలియజేసింది. అలాగే ఫస్ట్ లాంగ్వేజ్లో పేపర్ -1 లో 70 మార్కులకు, పేపర్ 2 లో 30 మార్కులకు ఉంటుందట.ఈ మెరకు పరీక్షలలో మార్పులు చేసినట్లు విద్యాశాఖ తెలిపింది.


పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విషయానికి వస్తే:
మార్చి 16: ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్ వన్)
మార్చి 18: సెకండ్ లాంగ్వేజ్
మార్చి 20: ఇంగ్లీష్
మార్చి 23: మ్యాథ్స్
మార్చి 25: భౌతిక శాస్త్రం
మార్చి 28: జీవశాస్త్రం
మార్చి 30: సాంఘిక శాస్త్రం
మార్చి 31: ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్ 2)
ఏప్రిల్ 1:OSSSC సెకండ్ లాంగ్వేజ్ (పేపర్ 2)

పట్టణాలలో రూ .24,000  గ్రామాలలో రూ .20,000  అలాగే 5 ఎకరాల భూమి మించని వారి పిల్లలకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. 2026 లో మొదటిసారిగా రెగ్యులర్ పరీక్షకు హాజరయ్యి బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే  ఇది వర్తిస్తుంది. వీరితో పాటుగా వికలాంగులు, KGBV విద్యార్థులకు కూడా ఫీజు మినహాయింపు కలదు. 2011 సెప్టెంబర్ ముందు పుట్టిన వారికి మాత్రమే 10వ తరగతి పరీక్షలు రాసేందుకు అర్హులంటూ ఏపీ ప్రభుత్వం స్పష్టత చేసింది. అధిక వయసు కలిగిన వారు వారి స్కూళ్లలోని హెచ్ఎంలు అనుమతి తీసుకోవాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: