టిడిపి పార్టీ నుంచి సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డి బామ్మర్ది మంత్రి గిరిధర్ రెడ్డి పైన కోర్టు ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ భూములలో అనుమతులు లేకుండా స్టోన్ క్రష్ ఏర్పాటు చేసి నల్ల రాయిని తరలించారని ఫిర్యాదు నేపథ్యంలో ఈ కేసు నమోదు చేశామని మదనపల్లి మైనింగ్ శాఖ అధికారి రంగ కుమార్, సిఐ గోపాల్ రెడ్డి నమోదు చేసామని తెలిపారు. గిరిధర్ రెడ్డి ఈ ఏడాది జూన్ లో " మేసర్స్ రిట్కో" కంపెనీ పేరుతో బి. కొత్తకోట మండలం తుమ్మనగంట పంచాయతీ పరిధిలో ఉండే ఏదరగొట్టపై క్వారీకి ఎల్పిఎం నెంబర్ 5471 లో రెండు హెక్టార్లకు అనుమతి ఇవ్వాలని మైనింగ్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు.
అయితే వీటికి సంబంధించి ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినా అక్కడ క్రష్ ఏర్పాట్లు చేసి నడిపారు.ఎల్పిఎం నెంబర్ 5472 లో 6623 క్యూబిక్ మీటర్ల నల్లరాయిని తొలగించి తరలించారని, ప్రభుత్వ శాఖ నుంచి అనుమతులు రాకపోయినా స్టోన్ క్రష్ నిర్వహించడం మీద అక్టోబర్ 8వ తేదీన రాత్రి మైనింగ్ మదనపల్లి ఏడి రంగ కుమార్, తాసిల్దార్ శ్రీనివాసులు, విజిలెన్స్ ఏడి సుబ్రహ్మణ్యం పోలీసులు తనిఖీలు చేపట్టారు. 5 ఎకరాలపైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి భవనాలు, స్టోన్ క్రష్ ఏర్పాటు చేశారని నిర్ధారించిన తర్వాత సీజ్ చేశారు. కంకర్ తో పాటు, రెండు పెద్ద వాహనాలు, రెండు జెసిబిలు, ఒక వాటర్ ట్యాంకును, స్టోన్ క్రష్ మిషన్ ని సీజ్ చేశారట. ప్రస్తుతం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు దర్యాప్తు చేయబడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి