ఈ రోజు డేట్ 16/02/2018 ఎందుకంటే జనసేన పార్టీ అధినేత, తెలుగు ప్రజల పవర్స్టార్ పవన్ కళ్యాణ్ తను మద్ధతుతో ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీని ఒక వివరణ పోనీ ఆయన బాషలో ప్రశ్న అడిగి దానికి తగినంత సమయ మిచ్చి దీన్నే డెడ్ లైన్ డేట్ అంటారు అదే 15/02/2018 అదీ ముగిసింది. పవన్ టీడీపీకి పెట్టిన డెట్ లైన్ - 15 వ తారీకు లోపు విభజన హామీలు, ఇంకా "ప్రత్యేక హోదా" పై పూర్తి వివరాలు ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు పై శ్వేతపత్రాన్ని ఇవ్వాలని కోరారు దానికి తెలుగుదేశం పార్టీ ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. డెడ్ లైన్ డేట్ ముగిసిపోయింది.

Image result for pavan jp undavalli

కనీసం నాలుగు సంవత్సరాల దాటుతున్నా రాష్ట్ర ప్రజల మంచి కోసం కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధుల వివరాలను అందివ్వాలిని పవన్ టీడీపీకి  డెడ్ లైన్ పెట్టారు. కానీ టీడీపీ మాత్రం ఎలాంటి వివరాలు అందించలేదు. దీంతో పవన్ కళ్యాణ్ తరవాత చర్య ఏమిటి? ఏం చేయబోతున్నాడు? అని అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఉద్దానం విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఇలానే ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇచ్చాడు. అయితే అప్పుడు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఉద్దానం సమస్యపై పరిష్కార చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. అసలు ఈ విషయంలో టీడీపీ కే సరైన సమాచారం లేదు, క్లారిటీ లేదు. వాళ్లే కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. పాపం ఇంక పవన్ కళ్యాన్కు ఏం చెప్పగలరు? 

Image result for pavan jp undavalli

 ఇక ఇప్పటికే ప్రజల అభిమాన లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్, కాంగ్రెస్ మాజీ నేత చట్టంపై సదవ్గాహన కలిగిన ఉండవల్లి అరుణ్ కుమార్ లతో చర్చలు జరిపిన పవన్ కళ్యాణ్ ఇంకా వామపక్ష నేతలను, జేఎఫ్సీ ప్రతినిధులను కలసి వారితో చర్చించ నున్నారు. రఘువీరా రెడ్డి వంటి కొందరు కాంగ్రెస్ పార్టీ నేతల తోనూ ఆయన మాట్లాడే ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. మరి ఈరోజుతో పవన్ కళ్యాణ్ ఇచ్చిన డెడ్ లైన్ పూర్తయి కొన్ని గంటలు కూడా దాటింది. ఇక తాను పెట్టిన డెడ్ లైన్ ముగిసే లోగా, ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే డెడ్ లైన్ ముగిసే పోయింది. మరి పవన్ కళ్యణ్ ఏం చేస్తార్ఫో? ఏం జరుగుతుందో? చూద్దాం అంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న సమయం లోనే ఒక కొత్త వార్త వెలుగు చూసింది. తెలుగువారి ధిమ్మ తిరిగిపొయింది.

తన పార్టీ సమన్వయ కమిటీలో మాట్లాడుతూ టిడిపి అధినేత పవన్ ఇచ్చిన డెడ్ లైణ్ రోజున - పవన్ చేపట్టనున్న జేఎఫ్సీ కమిటీపై కూడా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ చేసే పోరాటంలో అర్ధం ఉందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి మేలుచేయాలనే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని చంద్రబాబు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన కమిటీ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. అంతేకాదు పవన్ విషయంలో టీడీపీ నాయకులకు కొన్ని సూచనలు కూడా చేశారంట.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడరాదని. రాష్ట్రానికి మంచి చేయాలనేది పవన్ అభిమతమని, మనం కూడా రాష్ట్ర ప్రయోజనాలకోసమే పోరాడుతున్నామని ఈ నేపథ్యంలో, "ఇద్దరి దారీ ఒకటే"నని చెప్పారట. అవసరమైన సమయంలో టీడీపీకి ఆయన అనుకూలంగా ఉంటారని చెప్పారు. పవన్ కల్యాణ్ ప్రకటించిన జేఎఫ్సీతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. నిధుల గురించి పవన్ శ్వేత పత్రం అడిగితే సున్నితంగా సమాధానం చెప్పాలని సూచించారట. మొత్తానికి చంద్రబాబు మాటలను బట్టి చూస్తుంటే, వచ్చే ఎన్నికల్లో పవన్-చంద్రబాబు కలిసి బరిలో దిగొచ్చని స్పష్టంగా అర్ధంచేసుకోవచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి అవసరమైనప్పుడు అనుకూలంగా ఉంటాడు అంటే అర్ధం ఇంకేమై ఉంటుంది మరి. ఇప్పుడు దీన్నిబట్టి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వం నుండి సమాధానాలు రాబట్టలేడని, ఆయనకు తెలుదేశానికి భేధమే లేదని చెప్పవచ్చుకదా! 

Image result for pavan jp undavalli

పాపం పవన్ కళ్యాణ్ తో సన్నిహితసంభంధాలు నెరిపి ఆయన నాయకత్వంలో తమకు లేని ప్రజల మద్ధతు కూడగట్టుకుని ప్రజలకు విభజన హామీలు సాధించాలని కలలు కనే ఉండవల్లి ఆలోచనలకు పడింది"గుండుసున్నా!"ఇక జయప్రకాష్ నారా యణ విషయం ఆయనమాటల్లోనే విందాం. 

Related image

"జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీ సమావేశానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ దసపల్లా హోటల్‌‌ కు చేరుకున్న లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయ ప్రకాశ్‌ నారాయణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్‌‌చాట్‌‌లో మాట్లాడుతూ, తమపై ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని అన్నారు. మమ్మల్ని ఆకాశానికి ఎత్తి పడే యొద్దని, ఏపీకి వచ్చే నిధుల విషయంలో జరుగుతున్న అన్యాయంపై పోరాటంలో తమ వంతు ప్రయత్నం చేస్తామని జేపీ స్పష్టం చేశారు. దసపల్లా హోటల్లో పవన్ కళ్యాణ్ అధ్యక్షత జేఎఫ్‌సీ తొలి సమావేశం నిర్వహించారు. కేంద్రం నిధులు, విభజన హామీలపై జేఎఫ్‌సీలోని నేతలు, మేధావులు, న్యాయనిపుణులతో చర్చించనున్నారు.  

Image result for pavan jp undavalli

మరింత సమాచారం తెలుసుకోండి: