హైదరాబాద్: రాష్ర్ట మంత్రి ధర్మాన ప్రసాదరావు మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో తన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ధర్మానపై జగన్ అక్రమాస్తలు కేసుకు సంబంధించి సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేయగా...ఆయన తన మంత్రి పదవీకి గత నెలలో రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదించలేదు. గత నెలగా అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ధర్మాన నేడు కార్యకర్తలతో సమావేశమయ్యారు. తనపై వచ్చిన అభియోగాలు, సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటు, రాజీనామాకు దారితీసిన పరిణామాలపై కార్యకర్తలతో చర్చించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదనీ ధర్మాన కార్యకర్తలకు చెప్పారు.
మంత్రిగా తాను ఒక్కడిని ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేననీ, యావత్ కేబినెట్ అంతా కలిసి నిర్ణయాలు తీసుకుంటుందనీ, భూ కేటాయింపుల్లో తాను ఎక్కడా కూడా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోలేదనీ, అక్రమాలకు పాల్పడలేదనీ ధర్మాన కార్యకర్తలకు చెప్పారు. సీబీఐ కేసు నుంచీ తాను సచ్చీలతతో బయటపడుతాననీ, కార్యకర్తలెవరూ భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదనీ ధర్మాన కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.
మరింత సమాచారం తెలుసుకోండి: