అవునూ.. మీకు ఇండియా హెరాల్డ్ గ్రూప్ నుండి ఓ స్పెషల్ స్టోరీ అందిస్తున్నాం. అది దేని గురించి అంటే.. జీవిత సత్యం గురించి.. మనం ఎలా ఉండాలి. మనం ఎలా జీవించాలి. మనకు మన ముందు తరానికి ఉన్న తేడా ఏంటీ? అనే విషయాలు ఓకే ఒక్క మాటలో బిల్ గేట్స్ ఎలా చెప్పారు? అసలు ఏం చెప్పారు? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం.. 
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. ఇప్పుడు మనం చెప్పుకునే కథలో బిల్ గేట్స్ మరియు అతని కూతురు అని అనుకుందాం. ఎందుకంటే.. ఇపుడు మనం చెప్పుకునే కథలో ఓ ధనవంతుడైన తండ్రి మరియు అతని కూతురు ఉంటారు కాబట్టి బిల్ గేట్స్ మరియు అతని కూతురు అనుకుందాం. ఇక కథలోకి వెళితే.. బిల్ గేట్స్ కూతురు ఓ హోటల్ కి వెళ్లి అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసింది. అక్కడ ఉన్న అతను ఆమె ధనవంతురాలు అని గమనించి అతి వినయం నటించాడు. అయితే ఆమె చెప్పిన ఆర్డర్ వెంటనే ఫుడ్ తీసుకొచ్చాడు. అయితే ఆమె తిన్న తర్వాత బిల్ కట్టి వెళ్లే ముందు నమస్తే మేడం అన్నాడు. దానికి ఆమె ఓ చిరు నవ్వు నవ్వి 100 డాలర్లు టిప్ గా ఇచ్చింది. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 
ఇదిలా ఉండగా.. ఆ తర్వాత రోజు అదే హోటల్ కి బిల్ గేట్స్ వచ్చారు. వెంటనే అక్కడికి ఓ బాయ్ వచ్చాడు. ఆ బాయ్ కి బిల్ గేట్స్ తెలుసు. ఎలానంటే.. అంతకు ముందు రోజు బిల్ గేట్స్ తన కూతురుని ఇదే హోటల్ దగ్గర వదిలి వెళ్ళడం ఆ బాయ్ గమనించాడు. ఆ విధంగా ఆ బాయ్ కి బిల్ గేట్స్ తెలుసు. అయితే బిల్ గేట్స్ ఫుడ్ ఆర్డర్ చేయగానే క్షణాల్లో ఫుడ్ తీసుకొచ్చాడు. అయితే అతను తిన్న తర్వాత బిల్ కట్టి వెళ్తుండగా ఆ బాయ్ నమస్తే సార్ అన్నాడు. దానికి బిల్ గేట్స్ ఓ చిన్న నవ్వు నవ్వి 5 డాలర్లు టిప్ గా ఇచ్చారు. దాంతో అతనికి దిమ్మ తిరిగి పోయింది. వెంటనే ఆ బాయ్ ఏంటి సార్ నిన్న మీ కూతురు 100 డాలర్లు ఇచ్చింది. ఇంత ధనవంతుడైన మీరు కేవలం 5 డాలర్లు మాత్రమే ఇచ్చారు. అంటూ అడిగాడు. అయితే దానికి సమాధానంగా బిల్ గేట్స్ "చూడు బాబూ.. నిన్న నా కూతురు నీకు 100 డాలర్లు ఇచ్చిందంటే దానికి కారణం ఆమె తండ్రి ధనవంతుడు కావొచ్చు. కానీ నా తండ్రి మాత్రం చాలా పేదవాడు. చాలా కష్టపడి నన్ను ఇంతటి వాడిని చేశాడు. కాబట్టి నేను ఇంతే ఇవ్వగలను" అని చెప్పాడు. ఇది విన్న ఆ బాయ్ కి విషయం అర్థమయ్యింది. ఇక అప్పటి నుంచి ఎవరు ఎంత టిప్ ఇచ్చినా సంతోషంగా తీసుకునేవాడు. డియర్ రీడర్స్.. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. డబ్బులు వృధా చేయకండి. మంచి పనులకు ఉపయోగించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: