తిరుమల లో  దీపావళి ఆస్థానం గురావారం అత్యంత వైభవంగా జరిగింది తిరుమల శ్రీవెంకటేశుని  ప్రతి ఏడాది నాలుగు సార్లు ఆ స్థానం నిర్వహించడం ఆనవాయితీ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం దేవదేవునికి ఈ కార్యక్రమం  నిర్వహించారు శాస్త్రోక్తంగా జరిగిన కార్యక్రమంలో స్వామి వారిని శ్రీదేవి భూదేవి సమేతంగా   గరుడాళ్వార్ సన్నిధికి చేర్చారు   విష్వక్ సేనుల వారి ని స్వామివారికి అభిముఖంగా ఉంచి ఈ కార్యక్రమం జరిపించారు స్వామివారికి ప్రతి సంవత్సరం  ఆగమోక్తంగా ఈ క్రతువు నిర్వహించడం ఆనవాయితీ. ప్రధాన దేవాలయం లోపలికి బంగారు వాకిలి వద్ద ఈ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో సంప్రదాయ మేళవింపుతో అర్చక స్వాములు ఈ కార్యక్రమాన్ని చేస్తారు  శ్రీ వెంకటేశ్వరునికి ఉగాది ఒకసారి , తమిళ నెల ఆణి మాసంలో   ఒకసారి ఆస్థానం నిర్వహిస్తారు ఆ స్థానాన్ని ఆణివరాస్తానం అని అంటారు.  దీపావళి రోజున నిర్వహించే దీపావళి ఆస్తానం గా వ్యవహరిస్తారు.  అంతేకాక  శ్రీరామనవమి రోజున మరొకసారి ఈ కార్యక్రమం  జరుగుతుంది. వేంకటేశ్వర స్వామి గుడిలోకి ప్రవేశించే ముందు అంటే... జయ విజయులు ను దాటి లోపలికి వెళితే అక్కడ ఒక గది ఉంటుంది.  ఆ గదికి రాముల వారి మేడ అని పిలుస్తారు. ఆ గది స్వామివారికి మూల విరాట్ ఉన్న గదికి,  కులశేఖర ఆల్వార్ పడి ఉన్న గదికి మధ్యలో ఈ రాములవారి మేడ అనే గది ఉంటంది.  ఈ గదికి చాలా విశిష్టమైన ప్రత్యేకత ఉంది.  మలయప్ప స్వామికి నిర్వహించే నిత్యసేవలు అన్ని ఈ రాములవారి మేడ గదిలోనే జరుగుతాయి స్వామివారికి  ఏకాంతంగా జరిగే సేవలు కేవలం ఈ గదిలోనే జరపడం తరతరాలుగా ఆగమోక్తంగా వస్తున్న ఆనవాయితీ.


 ఇకపోతే  ఆస్తానం నాడు జరిగే ప్రత్యేక కార్యక్రమం ఏమిటంటే దేవస్థానం పాలకమండలి,  సిబ్బంది అందరూ కూడా ఇటీవలికాలంలో స్వామివారికి కి,  భక్త జనావళి కోసం చేసిన ఖర్చులన్నీ స్వామివారికి తెలియజేస్తారు ముందు జరిగిన ఆస్థానానికి నుంచి ఈరోజు వరకు స్వామి వారికి వచ్చిన కానుకలు, ఆదాయ, వ్యయాలను అధికారులు అక్కడ చదివి వినిపిస్తారు ఇదీ ఆస్థానం ప్రత్యేకత.
గురు వారం నిర్వహించిన  కార్యక్రమంలో  పెద జియ్యార్ స్వామి,  చిన జియ్యర్ స్వామి, టిటిడి పాలక మండలి అధ్యక్షులు వైవి సుబ్బా రెడ్డి, కార్యనిర్వహణాధి కారి జవహర్ రెడ్డి ఇతర అధికారులు  పాల్గోన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd