చేసేందుకు పెద్దగా పనేమీలేకపోవటంతో జనాలను భయపెట్టడమే పనిగా పెట్టుకున్నట్లున్నారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ  చంద్రబాబునాయుడు. తీరిగ్గా కూర్చుని సీనియర్ నేతలతోనో లేకపోతే పాలిట్ బ్యూరో సమావేశమనో కాసేపు మాట్లాడటం తర్వాత మీడియా సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురదచల్లేయటమే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో 440 ఎన్ కరోనా వైరస్ వేరియంట్ చాలా ప్రమాధకరమైనది కర్నూలులోనే పుట్టిందని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ఇదే సమయంలో ఏపిలో కొత్త వేరియంట్ అంత ప్రమాధకరమైనది కాదని శాస్త్రజ్ఞులు, సీనియర్ వైద్య నిపుణులు చెబుతున్నారు. శాస్త్రజ్ఞులకు, సీనియర్ వైద్య నిపుణులకంటే చంద్రబాబుకు ఎక్కువ తెలుసా ? అన్నదే అర్ధం కావటంలేదు.




ఒకవేళ కరోనా వైరస్ సెకెండ్ వేవ్ లో 440 ఎన్ వేరియంట్ నిజంగానే అంత ప్రమాధకరమనే అనుకుందాం. బాధ్యతగలిగిన ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు చేయాల్సిందేమిటి ? జనాలకు భరోసా ఇవ్వాలి. అంతేకానీ ఇటు జనాలను భయపెట్టేస్తు అటు ప్రభుత్వంపై బురదచల్లేయటం ఏమిటో అర్ధం కావటంలేదు. 18 ఏళ్ళవాళ్ళది ప్రాణాలు కావా ? వాళ్ళకు ఎందుకని టీకాలు వేయించటం లేదు ? అని విచిత్రంగా జగన్ను నిలదీస్తున్నారు. అసలు  ఈ ప్రశ్న వేయాల్సింది ఎవరిని ? నరేంద్రమోడిని అడగాల్సిన ప్రశ్న జగన్ను అడిగితే ఉపయోగం ఏమిటి ? అలాగే ఆక్సిజన్ అందక రోగులు చనిపోతున్నందుకు జగనే బాధ్యత వహించాలని పిచ్చి డైలాగులు చెబుతున్నారు. ఆక్సిజన్ నిల్వలు, సరఫరా మొత్తం కేంద్రం నియంత్రణలోనే ఉందన్న విషయం అందరికీ తెలుసు.




టీకాలు, ఆక్సిజన్ రెండూ కేంద్రం నియంత్రణలోనే ఉంటే వాటికి జగన్ను బాధ్యుడిని చేస్తే చంద్రబాబు అండ్ కో పదే పదే బురదచల్లేస్తున్నారు. ఇదే చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు పుష్కారల సమయంలో 29 మంది చనిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. మీడియా సమావేశంలో విలేకరులు ఇదే విషయమై అడిగితే ‘ఇపుడేమైపోయింది..అవుతుంటుంది ఒక్కోసారి ప్రమాదాలు  జరుగుతుంటాయి. కుంభమేళాలో చనిపోలేదా..జగన్నాధరథచక్రాల కిందపడి చనిపోలేదా’ ? అని ఎదురుప్రశ్నించారు. ప్రజల ప్రాణాలంటే ఇంత చులకన ఉన్న చంద్రబాబు ఇపుడు కరోనా మరణాలకు జగన్ దే బాధ్యతని, కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని పదే పదే గోల చేయటమే విచిత్రంగా ఉంది. మొత్తంమీద తీరికూర్చిని చేసేపనేమీ లేక జనాలను భయపెట్టే పని పెట్టుకున్నట్లున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: