
అలా బాగా పాపులర్ అయిన ఈ పాటను ఇప్పుడు టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా విభాగాలు కూడా బాగా వాడేసుకుంటున్నాయి. ఊ.. అంటావా.. రెడ్డి.. ఊహూ అంటావా రెడ్డి అంటూ టీడీపీ విభాగాలు జగన్‌ను ట్రోల్ చేయడానికి ఈ పాటను వాడుకుంటున్నారు. పాట లిరిక్స్ కూడా టీడీపీకి అనుకూలంగా మళ్లీ రాయించి... ఆ వెర్షన్‌కు అనువైన విజువల్స్ తో ఎడిటింగ్ చేయించి ట్రోల్ చేస్తున్నాయి.
అయితే.. ట్రోలింగ్‌లో వైసీపీ సోషల్ మీడియా టీమ్ కూడా ఏమీ తక్కువ తినలేదుగా.. వీళ్లు కూడా మరో వెర్షన్ రాయించి చంద్రబాబుపై రాజకీయ విమర్శలు ఎక్కుపెడుతూ వీడియో రూపొందించారు. దాన్ని బాగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇలా ఈ ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మామ పాట రాజకీయాల్లోనూ బాగా ఉపయోగపడుతోంది. ఈ పాట చాలా క్యాచీగా ఉండటం.. ఇంద్రావతి చౌహాన్ వాయిస్ బాగా కలిసి వచ్చాయి.
దీనికి తోడు సమంత విడాకుల తర్వాత ఈ పాటలో మొదటిసారిగా ఐటమ్ సాంగ్ చేయడం కూడా ఈ పాపులర్ అయ్యేందుకు దోహదం చేశాయి. సోషల్ మీడియాను ఇటీవల పార్టీలు విపరీతంగా వాడుకుంటున్న సమయంలో ఇలాంటి పాటలు కూడా అందుకు సాయం చేస్తున్నాయి. రాజకీయ యుద్ధాలకు సహకరిస్తున్నాయి. మరి మీరేమంటారు.. ఊ.. అంటారా.. ఊహూ.. అంటారా..?