ముందుగా జయప్రకాష్ రెడ్డి పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది రాయలసీమ యాస. ఆయన సినీ ఇండస్ట్రీలో రాయలసీమ యాసలో  చెప్పే సంభాషణలకు చాలా ప్రసిద్ధి. దాదాపు మూడు వందల సినిమాల్లో నటించినప్పటికీ , ప్రతి సినిమాలోనూ కేవలం రాయలసీమ యాసను మాత్రమే వాడటం విశేషం.. జయ ప్రకాష్ రెడ్డి కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలంలోని వీరారెడ్డి పల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో 1946 మే 8 న జన్మించాడు. ఇక ఈయన తండ్రి సాంబిరెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేసేవారు. నెల్లూరు లోని పత్తేకాన్ పేట లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత నెల్లూరులోని రంగనాయకులపేటలో  ఉన్నత పాఠశాలలో చేరాడు.


ఈయన పదో తరగతిలో ఉండగా నాన్న కు అనంతపురం బదిలీ అయింది. అక్కడ సాయిబాబా నేషనల్ హైవే సెకండరీ స్కూల్లో (ఎస్ఎస్ఎల్సీ) లో చేరాడు. ఇక కొన్ని సంవత్సరాల తరువాత జయప్రకాష్ తండ్రి డీఎస్పీ  హోదాలో నల్లగొండకు బదిలీ అయ్యాడు. తండ్రి కోసం నల్లగొండ వచ్చి పోతుండేవాడు.. ఇక అక్కడికి వచ్చి రావడంతో బంధువులు ,స్నేహితులతో మాట్లాడుతూ తెలంగాణ భాష మీద పట్టు దొరికింది. జయప్రకాష్ రెడ్డి ఎప్పుడు చదువులో ముందుండేవాడు. అందుకే  డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని, గణిత ఉపాధ్యాయుడుగా ఉద్యోగంలో చేరాడు. అంతేకాకుండా 1979 - 81 వ సంవత్సరం మధ్యలో నల్గొండలోని సెయింట్ ఆల్ఫోన్సన్ హైస్కూల్లో మాథ్స్ టీచర్ గా పనిచేశారు.. సినిమాపై ఆసక్తి ఉండడంతో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నాడు..


జయ ప్రకాష్ రెడ్డి నల్గొండ లో డాక్టర్ రాజారావు మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ తరపున అనేక నాటకాలలో నటించి, దర్శకత్వం  కూడా వహించాడు. ఒకరోజు ఒక నాటకంలో ప్రదర్శిస్తున్నప్పుడు , దాసరి నారాయణ రావు జయ ప్రకాష్ రెడ్డి ని చూసి ఆయన నటనకు ఫిదా అయిపోయారు. ఇక వెంటనే  నిర్మాత రామానాయుడికి  పరిచయం చేశాడు . ఇక ఆయన కుటుంబ సభ్యుల ముందు జయ ప్రకాష్ రెడ్డి ఆ నాటకాన్ని  ప్రదర్శించాడు. అలా 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి పరిచయం అయ్యాడు.. అయితే తన తండ్రి బదిలీలతో అనంతపురం, కర్నూలు ,కడప ,ప్రొద్దుటూరు లో చదువుకోవడం , గుంటూరు ,నల్గొండలో నివసించడం వల్ల రాయలసీమ, నెల్లూరు, శ్రీకాకుళం, కోస్తా, ఆంధ్ర, తెలంగాణ ఇలా అన్ని ప్రాంతాల మాండలికాల పై పట్టు వచ్చింది.

జయప్రకాష్ రెడ్డి 2000 సంవత్సరంలో జయంమనదేరా చిత్రానికి నంది అవార్డు కూడా అందుకున్నాడు. అంతేకాకుండా రాణిరుద్రమ, వేట, కొత్త సైనికుడు  సినిమాలకు కూడా నంది అవార్డులను తీసుకున్నాడు. తనదైన శైలిలో నటించి, ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈయన 2020 సెప్టెంబర్ 8వ తేదీన గుంటూరులో తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ మూగబోయింది. ఇక జయప్రకాష్ రెడ్డి స్థానాన్ని  మరెవరు పూడ్చలేని విధంగా లోటు మిగిలిపోయింది..


మరింత సమాచారం తెలుసుకోండి: