దక్షిణాది చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు సిల్క్ స్మిత. అప్పట్లో ఆమెకి ఉండే క్రేజ్ ఏ హీరోయిన్ కూడా ఉండేది కాదు. సిల్క్ స్మిత మొదట ఇండస్ట్రీకి మలయాళం సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ఆమె దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఓ సంచలన తారగా పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే స్మిత అసలు పేరు విజయలక్ష్మి. ఆమె ఇండస్ట్రీకి వచ్చాక సిల్క్ స్మితగా పేరు మార్చుకుంది.

సిల్క్ స్మితగా పేరు మార్చుకున్న తరువాత ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాలు సృష్టించింది. అంతేకాదు.. అప్పట్లో జయమాలిని, జ్యోతిలక్ష్మి, అనురాధ తరువాత వ్యాంప్ పాత్రలతో పాటు ప్రత్యేక గీతాలకు ఆమె కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిపోయింది. ఇక అప్పట్లోనే ఆమె కుర్రకారు హృదయాలలో ఆరాధ్య దేవతగా మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే.. ఏ హీరో, హీరోయిన్‌కు రాని క్రేజ్ స్మిత సొంతం చేసుకుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆమెను చాలామంది ముద్దుగా సిల్కు అని పిలుస్తుండేవారు.

ఇక అప్పట్లో ఏ హీరో సినిమాలోనైనా కచ్చితంగా సిల్క్ స్మిత ఒక ప్రత్యేకమైన పాటలో నటించేది. ఆ సినిమా మొత్తానికి ఆమె నటించిన ఆ స్పెషల్ సాంగే అట్రాక్షన్‌గా కనిపిస్తుండేది. అప్పట్లో కేవలం ఆమె పాట కోసమే సినిమా థియేటర్లకి జనాలు గుంపులు గుంపులుగా వెళ్లేవారట. ఇక దీన్ని బట్టి చూస్తే ఆమెకు ఎంతటి క్రేజ్ ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతటి పాపులారిటీ సంపాదించిన సిల్క్ స్మిత జీవితంలో ఊహించిన మలుపులు తిరిగాయి. ఆమె మరణం కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

ఇక ప్రస్తుతం ఆమెకి సంబంధించి వైరల్ అవుతున్న విషయం ఏంటంటే.. సిల్క్ స్మిత మరణానికి కారణం ఒక హీరోనే అని ఓ వార్త వినపడుతుంది. అయితే సిల్క్ స్మితతో ఆ హీరో కొద్దిరోజుల పాటు ప్రేమాయణం నడిపి.. ఆమెను మద్యానికి బానిస చేసి.. ఆ తరువాత ఆమె ఆస్తిని రాయించుకున్నాడని సమాచారం. ఆ తర్వాత ఆమెను వదిలి పెట్టాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మనస్థాపానికి గురైన స్మిత అతిగా మద్యానికి బానిసగా మారిపోయి.. తన జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: