ఓం.. ఓం.. ఓం.. ఓం కారానికి హిందూ జీవన విధానంతో ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే. వేదాల్లో, భగవద్గీతలో, యోగాలో..ఇలా ఎక్కడ చూసినా ఓం కనిపిస్తుంది. ఏ పని ప్రారంభించినా ముందు ఓం రాయడం చాలా మందికి ఓ అలవాటు. కానీ ఓంకు ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది..ఓసారి పరిశీలిద్దాం..

సంబంధిత చిత్రం


ఓం శబ్దంపై అనేక పరిశోధనలు కూడా జరిగాయి. వాటిలో తేలిందేమిటంటే.. ఓం శబ్దం పలికినప్పుడు మెదడులోని నాడీ వ్యవస్థ ఎక్కువగా ఉత్తేజితమవుతుందట. ఓం పలకడంవల్ల మెదడులోని కార్టెక్స్‌ ముందుభాగం ఉత్తేజితమవుతుందని అధ్యయనంలో తేలింది.

om mantra chant కోసం చిత్ర ఫలితం


ఓం పఠించడం వల్ల మెదడులో భావనియంత్రణ వ్యవస్థపై ప్రభావం పడిందని శాస్తవేత్తలు శాస్త్రీయంగా రుజువు చేశారు కూడా. అయితే ఓం శబ్దాన్ని పఠించేటప్పుడు.. ఇది మనలో మార్పు తెస్తుందన్న నమ్మకంతో పలకాలి లేకపోతే..ఎలాంటి ప్రయోనం ఉండదని కూడా ఆ అధ్యయనాలు రుజువు చేశాయి.

సంబంధిత చిత్రం


ఓం శబ్దం వల్ల నాడీవ్యవస్థలో, మానసికపరమైన, రసాయనికంగా ఎటువంటి మార్పులు కలిగాయో తెలుసుకోవడం ద్వారా మానసిక రోగాలను నయం చేయవచ్చని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఫలితాలను.. ఓం పలికినప్పుడు మెదడులో కలిగే మార్పులను... ఎమ్‌ఆర్‌ఐ, మెదడుకు సంబంధించిన ఇతర చిత్రాల ద్వారా కూడా రుజువు చేశారు. అందుకే మానిసిక ప్రశాంతత కోసం ఓం దివ్య మంత్రమనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: