ఉత్తరాది ప్రజలు బయటికి అడుగుపెట్టాలంటే తెగ భయపడిపోతున్నారు. తలుపు తెరిస్తే చాలు.. దట్టంగా కమ్మేసిన కాలుష్యాన్ని చూసి ఆందోళన చెందుతున్నారు. వాతావరణంలో ఆక్సిజన్ శాతం పడిపోగా.. విషవాయులు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. చాలామంది ప్రజలు అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇక వృద్దులు, పిల్లల పరిస్థితి అయితే మరీ దారుణం. ఎందుకంటే వాళ్లలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి.. ఎయిర్ పొల్యూషన్ తో లేనిపోని అనారోగ్య సమస్యల భారిన పడుతున్నారు. దీపావళి తర్వాత ఉత్తరాదిన ఈ పరిస్థితి దాపురించింది. 


ఇదిలా ఉంటే.. ప్రజలే కాదు.. దేవుళ్లు సైతం వాయుకాలుష్యం భారిన పడుతున్నారు. దీంతో ఆందోళన చెందిన భక్తులు దేవతా విగ్రహాలకు మాస్క్ లు కట్టి.. తమ ఇష్ట దైవంపై ఉన్న భక్తిని చాటుకుంటున్నారు. వారణాసిలోని సిగర్ పరిధిలో ఉన్న కాశీ విశ్వవిద్యాలయం సమీపంలో ఉన్న శివపార్వతి ఆలయంలోని  విగ్రహాలకు అక్కడి పూజారి, భక్తులు మాస్క్ లు తొడిగారు. 
అంతేకాదు.. వేసవి కాలంలో అయితే తమ ఇష్ట దేవాలను ఎండ నుంచి రక్షించేందుకు భక్తులు చందనం పూస్తారు. శీతాకాలంలో చలి నుంచి రక్షించేందుకు స్వెటర్లు, కంబళ్లు కప్పుతారు. తాజాగా కాలుష్యం నుంచి రక్షించేందుకు మాస్క్ లు ధరించి తమ దేవుళ్ల పట్ల ప్రేమను చాటుకుంటున్నారు.  


అటు ఢిల్లీ, హర్యానాలోనూ వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఆందోళన చెందిన ఢిల్లీ ప్రభుత్వం సరి-బేసి విధానంలో వాహనాలకు అనుమతి ఇచ్చింది. వీఐపీలు మినహా రూల్స్ అతిక్రమించిన సాధారణ వాహనదారులపై ఫైన్ ల మోత మోగించింది. ఇటీవల కొద్ది పాటి వర్షం పడినా.. వాతావరణంలో ఎలాంటి మార్పు రాలేదు. వాయు కాలుష్యం ఏమాత్రం తగ్గలేదు. ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి చెట్లను నీటితో తడిపినా ప్రయోజనం లేకుండా పోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: