
సర్వం శివమయం జగత్. శివపురాణ గాథ ప్రకారం, లయకారుడైన శివుడు లింగ రూపంలో ఉద్భవన జరిగిన రోజును మహాశివరాత్రి అంటారు. మాఘమాసంలో లో కృష్ణ పక్షంలో చతుర్ధశి తిధి నాడు వస్తుంది. అందులోనూ కృష్ణ చతుర్ధశి అంటే అమావాస్యకి ముందు వచ్చే చతుర్ధశి తిధి శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కావున ప్రతీ మాసంలో వచ్చే కృష్ణ చతుర్ధశి తిధులు మహాశివరాత్రులుగా ఉంటాయి. ఆ రోజున ఆ పరమశివుడికి అభిషేకార్చనలు చేస్తూ ఉపవాస దీక్షను పాటిస్తూ, రాత్రంతా జాగారం చేస్తూ పండుగను జరుపుకుంటారు..ఈ మాహా శివరాత్రి రోజున చేసే ఉనపాసం, జాగారముల యొక్క విశిష్టత ఏమిటనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సూర్యోదయానికి కన్నా ముందే నిద్ర లేచి, స్నానాది కార్యాక్రమాలు ముగించుకొని, శివార్చన చేయవలెను. అభిషేకప్రియశ్శివః అనగా.. శివుడు అభిషేక ప్రియుడు. శివరాత్రి రోజున ఇంటి వద్ద పుజాకర్యక్రమలను ముగించుకొని, శివాలయానికి వెళ్లి ఆ పరమశివుడికి పంచమృతాలతో అభిషేకాలను నిర్వహిస్తారు. ఇలా చేయడం కుదరని పక్షంలో చిన్న మట్టి శివలింగానికి మంచి నీటితో హర హరా అంటూ అభిషేకించినా కూడా శివుడు ఎంతగానో పొంగిపోతాడట. ఎంత ఘనమైన పుజని చేశామనేది శివుడి ఎప్పుడు చూడడు, భక్తి శ్రద్ధలతో ఓం నమఃశ్శివాయ అని తలచినా చాలనుకునే అల్ప సంతోషి, భోలాశంకరుడు పరమశివుడు...
శివారాత్రి పర్వదినాన ఉపవాసం చేయడం అంటే ఏమి తినకుండా శరీరాన్ని బాధపెట్టడం కాదు. స్వల్పంగా అల్పాహారం తీసుకుంటూ, ప్రతిక్షణం శివనామ స్మరణ చేయడం. అయితే చాలా మంది శివరాత్రి ఏడాదికి ఒక్క సారి వస్తుంది కదా ఒక్క రోజు కూడా ఆ పరమశివుడు కోసం ఉండలేమా అంటారు. అలా అనుకున్నా సరే మంచి నిర్ణయమే. అయితే వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణులు , అనారోగ్య సమస్య ఉన్న వారు ఈ ఉపవాస దీక్షను చేయకూడదు. ఇక తరువాతి ప్రధానమైన అంశం జాగారం..
ఈ పర్వదినాన సూర్యాస్తమయం సమయం మొదలు లింగోద్భావ సమయం వరకూ మేలుకొని ఉండి ఆ పరమశివుడిని పూజిస్తూ ఉండడం. పూజించడం అంటే శ్లోకాలను చదవడం మాత్రమే కాదు ఇంద్రియాలన్నిటిని ఆ శివుడిపై లగ్నం చేయడం. శివ పురాణం చదవడం, శివ మహిమలు వినడం, లేదా మనసుకు నచ్చిన విధముగా ఆయన స్మరణ చేయడం. ఓపిక ఉన్న వారు తరువాతి రోజు సూర్యోదయం వరకు మేలుకొని ఉండవచ్చు, కుదరని పక్షాన లింగోద్భావ సమయం అనంతరం నిద్రపోవచ్చు. జాగరణ చేయదలచిన వారు తరువాతి రోజు ఉదయం కూడా నిద్రపోకూడదు. అయితే ఈ జాగారం చేసే సమయంలో అనవసరమైన విషయాల గురించి చర్చించు కోవడం కంటే కూడా మొత్తం రోజంతా కూడా ఎలాంటి వాదన చేయకుండా, దుర్భాషలాడకుండా మనస్సుని మొత్తం ఆ శివునిపై నిలిపిన యెడల ఆ పరమశివుని కటాక్షం తప్పకుండా లభిస్తుందని అంటున్నారు వేద పండితులు.