అశేష భక్త జనం ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవం ప్రారంభమైంది. పదిహేను రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఎంతో  ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఇక పదిహేను రోజుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు జరిగే ఉత్సవం అత్యంత ప్రాధన్యత కలిగినది. నరసింహుడు శ్రీదేవి భూదేవి సమేతుడై బ్రహ్మరథం లో కొలువుదీరి.. భక్తజన సందోహం మధ్య తిరువీధుల్లో ఊరేగుతూ ఉంటాడు. స్వామివారి శోభయాత్ర ఎంతో దేదీప్యమానంగా జరుగుతూ ఉంటుంది. దాదాపు 500 టన్నుల బరువు,  నలభై ఏడు అడుగుల ఎత్తు కలిగిన కొలువుదీరిన వసంత వల్లభుని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావడానికి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తారు. 

 

 

 కేవలం జిల్లాలోని నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి విచ్చేసి స్వామి వారికి కృపకు పాత్రులు అవుతారు.. భక్తులు భారీ సంఖ్యలో విచ్చేసి ఉండడంతో అక్కడి ప్రాంత మొత్తం భక్త జనంతో కిటకిటలాడుతోంది. బ్రహ్మదేవుని ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాలను బ్రహ్మోత్సవాలు అనే పేరు ఉంది. స్వామివారి కల్యాణోత్సవం అనంతరం శ్రీవారు తిరువీధుల్లో విహరిస్తూ... భక్తులందరికీ దర్శనమిస్తూ వుంటాడు. అయితే శ్రీ వారు తిరువీధుల్లో విహరించడానికి దేవుళ్ళందరూ స్వామివారికి ఒక్కో రోజు ఒక్కో వాహనాన్ని పంపిస్తారు అంటూ భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇందులో భాగంగానే సాక్షాత్తు బ్రహ్మదేవుడే రథానికి ముందు భాగంలో ఉండి నడుపుతూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారిని తిరువీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగిస్తారు. 

 

 

 ఆదివారం తెల్లవారుజామున నుండే  యాగశాలలో ప్రత్యేక పూజలు హోమం అమ్మవార్లను శ్రీవారిని తెచ్చి ఆరోహణం చేయిస్తారు. అనంతరం రథం కింది భాగంలో కుష్మాండ బలి,  బలి హరణం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం రథోత్సవాన్ని ప్రారంభిస్తారు. ఇక స్వామివారి రథోత్సవం ముందుకు సాగుతున్న సమయంలో భక్తుల గోవిందనామ స్మరణలతో సమీప ప్రాంతం మొత్తం మార్మోగిపోతోంది. రథం చక్రాల కింద భక్తులు గుమ్మడికాయల పెట్టి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇక ఈ బ్రహ్మోత్సవాలకు అశేష భక్త జనం హాజరయ్యేందుకు రావడంతో పాటు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ కాంబోజి రెడ్డప్పశెట్టి, ఈవో  వెంకటేశ్వర్ రెడ్డి   తెలిపారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముగ్గురు డిఎస్పీలు పర్యవేక్షణలో ఈ బ్రహ్మోత్సవాలకు పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: