మన శాస్త్రాల్లో బల్లికి చాలా ప్రాముఖ్యం ఉంది. ప్రముఖంగా బల్లిపై ఓ శాస్త్రమే ఉందంటే ఇక అర్థం చేసుకోండి. బల్లి మనపై పడితే ఏం చేయాలనేది ఈ శాస్త్రంలో ఉంటుంది. బల్లి మనపై పడగానే ఆందోళన చెందడం పక్కన పెట్టి ఏం చేయాలో ఆలోచించాలి. శరీరంపై బల్లి పడిన భాగాన్ని బట్టి మనం చేయాల్సిన పరిహారం ఉంటుంది. అయితే బల్లిశాస్త్రంపై అవగాహన లేని వారు ఏం చెయ్యాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అయితే బల్లి మన శరీరంపై ఎక్కడ పడినప్పటికీ వెంటనే తలస్నానం చేసి, దీపం పెట్టి, నైవేద్యంతో ఇష్ట దైవాన్ని ప్రార్థించాలని బల్లి శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

బల్లి లేదా తొండ తల మీద నుంచి కిందకు దిగితే మంచిది కాదు. అదే కింద నుంచి పైకి పాకి వెంటనే దిగితే మంచి జరుగుతుంది. శరీరంపై కొన్ని ప్రత్యేక స్థానాల్లో బల్లి పడటం వల్ల కొన్ని రకాల ఫలితాలు కలుగుతాయి. అలాగే కొన్ని రకాల నష్టాలు కూడా కలుగుతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ బల్లి శకునాలు మగవారికి ఒకలా, స్త్రీలకు ఒకలా ఉంటాయి. అవి మనం వేరువేరుగానే తెలుసుకుందాం.

మగవారిలో..
మగవారి తలపై బల్లి పడితే మరణం వెంటాడుతుందని సంకేతం. ముఖంపై పడితే ఆర్థిక సమస్యల నుంచి బయట పడి లాభాలు కలుగుతాయి. ఎడమ కన్నుపై పడితే శుభం. కుడి కన్నుపై పడితే అపజయం కలుగుతుంది. నుదురుపై పడితే ఇతర సమస్యలు రావడం, ఎడబాటు(విడిపోవడం). కుడి చెంపపై పడితే బాధలు ఎక్కువవుతాయి. ఎడమ చెవిపై పడితే ఆదాయం బాగా వస్తుంది. పైపెదవి అయితే కలహాలు వెంట పడతాయి. కింది పెదవి ఆదాయంలో లాభం కలుగుతుంది. రెండు పెదవుల మధ్య పడితే మృత్యువు సంభవిస్తుంది. వీపుపై ఎడమ భాగం విజయం కలుగుతుంది. మణికట్టు అలంకార ప్రాప్తి కలుగుతుంది. మోచేయి డబ్బు నష్టం. వేళ్ళపై పడితే అనుకోకుండా బంధువులు, స్నేహితుల రాక, కుడి భుజంపై పడితే కష్టాలు, సమస్యలు. ఎడమ భుజం పదిమందిలో అవమానం జరుగుతుంది. తొడలపై పడితే దుస్తులు, వస్త్రాలు నాశనమవుతాయి. మీసాలపై పడితే కష్టాలు వెంటాడుతాయి. కాలి వేళ్ళపై అయితే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. పాదములపై అయితే ప్రయాణానికి సిద్ధం అని అర్థం. ఇవన్నీ పురుషులపై బల్లి పడితే కలిగే విషయాలు. బల్లి పై పెదవిపైన పడితే వ్యయం, క్రింది పెదవి పైన లాభం, గడ్డము మీద కారాగృహప్రాప్తి, కంఠముపై శతృహాని, మెడపైన భయం, రొమ్ముమీద విజయం, కుడి భుజంపైన ఆరోగ్యం, ఎడమ భుజముపైన పడితే స్త్రీ భోగము కలుగుతాయి.

స్త్రీలకు..
స్త్రీల తలపై బల్లి పడితే మరణ భయం, కొప్పుపై రోగాల భయం, పిక్కలపై బంధువుల రాక, ఎడమ కన్ను భర్త వేరొకరి ప్రేమను పొందుతారట, కుడి కన్ను మనోవ్యధ, రొమ్ము (వక్షస్ధలం) మంచి జరుగుతుంది, కుడి చెంప మగ శిశువు జన్మిస్తాడని, కుడి చెవి ధనలాభం.. ఆదాయం, పై పెదవి విరోధములు కలుగుతాయి, కింది పెదవి కొత్త వస్తువులు మీ చెంతకు చేరుతాయి. స్త్రీలకు రెండు పెదవులపై పడితే కష్టాలు, సమస్యలను ఫేస్ చెయ్యాలి. వీపు పైన పడితే మరణవార్తను వింటారు.. గోళ్ళపై పడితే చిన్నచిన్న కలహాలు గొడవలు.స్త్రీల ఎడమ చేయిపైన బల్లి పడితే మెంటల్ స్ట్రెస్, వేళ్ళపై పడితే నగల ప్రాప్తి కలుగుతుంది. కుడిభుజం కామరతి ప్రాప్తి కలుగుతుంది, తొడలు- కామము, మోకాళ్ళు ఆదరణ, అభిమానం, చీలమండలము కష్టాలు, కుడి కాలిపై పడితే గొడవలు, కాలివేళ్ళు పుత్రుడు జన్మిస్తాడు. బల్లి గుండెలపైన పడితే భయం, కడుపుపై పడితే సంతాన లాభం, మోచేతినందు నష్టం, అరచేతినందు ధనలాభం, వెన్నుమీద భయం, పిరుదుల మీద శయ్యాలాభం, తొడ భాగంపైన విషపు జంతువుల వలన ప్రాణ భయం, మోకాలిపైన వాహనలాభం, పాదములమీద ప్రయాణము, వ్రేళ్ళపైన రోగము, అరికాలిపైన బల్లి పడితే ఉన్నత పదవులు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

మగవారు, స్త్రీలలో ఎవరికైనా..
బల్లి ఎవరికైనా సరే తలమీద పడితే కలహము, బ్రహ్మరంధ్రం మీద భయం కలుగుతాయి. జుట్టుమీద అయితే కష్టం, వెనుక జుట్టుపైన పడితే మృత్యు భయం, జడమీద మృత్యు భయం వంటివి కలుగుతాయి. అదేవిధంగా ముఖంపైన పడితే బందు దర్శనం, కనుబొమ్మల మీద కలహం, కుడి కన్నుమీద ఓటమి, ఎడమకన్ను మీద అవమానం, కుడిచెవి మీద దుర్వార్త వినటం, ఎడమచెవి మీద వర్తక లాభం, ముక్కుమీద ఆరోగ్య సమస్యలు కలుగుతాయని బల్లిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: