
ఆ రాతను ఎవరికి వారు వారి ఉపాసన శక్తితో మార్చుకునే అవకాశం ఉంటుందట. ఆ ఉపాసన మార్గం భగవంతుని నామస్మరణ అట. ఎవరైతే నిరంతరం దేవుడిని పూజిస్తూ జప, దాన పుణ్య కర్మలను అనుసరిస్తారో వాళ్లు తలరాతను మార్చుకోవచ్చు. మార్కండేయుడి జీవితమే ఇందుకు ఉదాహరణ అని చెప్పవచ్చు. అదే సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.
ఎవరైతే కష్టపడతారో పట్టుదలతో ప్రయత్నిస్తారో వాళ్లు సైతం తమ తలరాతను తిరగరాసి కోరుకున్న లక్ష్యాలను సాధిస్తారని చెప్పవచ్చు. ఈ విధంగా తలరాతను మార్చుకోవచ్చు. తలరాత ఎప్పటికీ మరదని భావించి మనల్ని మనం మార్చుకోకుండా ఉంటే మాత్రం కచ్చితంగా తప్పే అవుతుందని చెప్పవచ్చు. బ్రహ్మ రాసిన రాత సైతం మన కృషి వల్ల మారే అవకాశం ఉంటుంది.
మన తలరాతను బట్టి మాత్రమే మన జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. కొందరు జ్యోతిష్కులు, పండితులు దేవుడు మన రాతలో కష్టపడితే ఫలితం దక్కుతుంది అని కూడా రాసి ఉంటుందని చెప్పొచ్చని కామెంట్లు చేస్తున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు