
"వినాయకుడు సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు" అనే నమ్మకం అందరిదీ. చిన్న చిన్న నైవేద్యాలు, పూజలతోనే గణేశుడు సంతోషిస్తాడు. కానీ అదే సమయంలో, ఆయనకు నచ్చని పనులు చేస్తే లేదా నచ్చని వస్తువులు పూజలో సమర్పిస్తే వెంటనే దానికి ప్రతికూల ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అందులో ముఖ్యంగా ఒక తప్పు ఏమిటంటే, గణేశ పూజలో తులసి ఆకులను వాడకూడదు. పురాణాల ప్రకారం గణేశుడు ఒకసారి తులసిని శపించాడు. దాంతో ఆయన పూజలో తులసి దళాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదు అని స్పష్టంగా చెప్పబడింది. పండితులు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు. చాలామంది తెలియక లేదా అలవాటుగా ఇతర పూజల్లాగానే వినాయకుడి పూజలో కూడా తులసి వేసే అవకాశం ఉంటుంది. కానీ ఇది మహా తప్పు అని పండితులు హెచ్చరిస్తున్నారు.
తులసి పువ్వులు, ఆకులు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనవి. కానీ గణేశుడికి మాత్రం అవి ఇష్టం ఉండవు. "వినాయక చవితి పూజలో తులసి ఉపయోగిస్తే అనర్థాలు సంభవిస్తాయి" అని పండితులు చెబ్బుతున్నారు. అందువల్ల గణపతి పూజలో తులసి ఉపయోగించకూడదనే ఆచారం ఈ రోజుకీ కచ్చితంగా పాటించబడుతోంది. అయితే వినాయకుడు ఎంతో ఇష్టపడేది పిండివంటలు. ప్రత్యేకంగా ఉండ్రాళ్లు, లడ్డూలు, కుడుములు, మోదకాలు. వీటిని నైవేద్యంగా సమర్పిస్తే గణేశుడు సంతోషించి భక్తులకు సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తాడు. పిల్లలకు విద్యాభివృద్ధి కలుగుతుంది, కుటుంబానికి శాంతి, సంపదలు వస్తాయి అని విశ్వాసం. మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, వినాయకుడిని పూజించేటప్పుడు తప్పనిసరిగా అరవల్లిగడ్డ (దర్భలు, గడ్డిపువ్వులు) ఉపయోగించడం శ్రేయస్కరం. గడ్డిని గణపతి ఎంతో ఇష్టపడతాడు. పూజలో గడ్డిని సమర్పించడం వలన కష్టాలు తొలగి, ఇంటిలో ఆనందం, సుఖసంతోషాలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు.
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ఇది ఎంత వరకు నమ్మడం అనేది మీ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దీనిని ఇండియా హెరల్డ్ ధృవీకరించడం లేదు..!