వినాయక చవితి చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా చేసుకునే పండగ ఇది. ఎంతోమంది భారీ భారీ విగ్రహాలను పెడుతూ నవరాత్రులు కొలుస్తూ ఉంటారు. అయితే వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించే ముందు ప్రతి ఒక్కరు స్నానం చేస్తారు. కానీ అలా స్నానం చేసే ముందు ఈ ఒక్క వస్తువును నీటిలో కలుపుకొని స్నానం చేస్తే మాత్రం రాజయోగం పట్టడమే కాకుండా ఇప్పటివరకు మనం చేసిన పాపాలన్నీ పోయి అపర కుబేరులు అవుతారని పండితులు చెబుతున్నారు. మరి ఇంతకీ వినాయక చవితి రోజు స్నానం చేసే నీటిలో కలుపుకోవాల్సిన ఆ పదార్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 వినాయక చవితి రోజు సూర్యోదయం కాకముందే స్నానం చేయాలి. అయితే అలా స్నానం చేసే నీటిలో పసుపు రంగు పువ్వులను  గానీ, పసుపును గానీ లేదా 7 గరికపోచలు కానీ వేసుకొని స్నానం చేస్తే ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.ఇక పసుపు రంగు పువ్వులు అంటే గన్నేరు పువ్వు తప్ప మిగిలిన పసుపు రంగులో ఉండే ఏ పువ్వులైనా సరే వాటి రెక్కలను తుంచి నీటిలో వేసుకొని ఐదు నిమిషాలు అయ్యాక స్నానం చేయాలట.ఒకవేళ పసుపు రంగు పువ్వులు దొరకకపోతే పసుపు వేసుకొని అయినా స్నానం చేయవచ్చు.

లేకపోతే 7 గరికపోచలని తీసుకొని వాటిని తుంచి నీటిలో వేసి ఐదు నిమిషాలు అయ్యాక స్నానం చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ఇక గరిక పోచల వల్ల ఆరోగ్యమే కాకుండా వినాయకుడికి కూడా గరికపోచలు ప్రీతికరమైనవి కాబట్టి అలా స్నానం చేస్తే వినాయకుడు మంచి శుభాలు కలిగిస్తాడట. ఇలా వినాయక చవితి రోజు స్నానం చేసే నీటిలో గరికపోచలు కానీ, పసుపు కానీ, పసుపు రంగు పుష్పాలు గాని వేసుకొని స్నానం చేస్తే ఆ విఘ్నేషుడి అనుగ్రహం పొందడమే కాకుండా అనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతాయి.పాపాలు తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు..

గమనిక: పైన తెలిపిన వివరాలు కొంతమంది పండితులు తెలిపినవి. వీటికి ఆధునికంగా శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం కారణంగా వీటిని నమ్మడం నమ్మకపోవడం అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరింత సమాచారం తెలుసుకోండి: