అలాంటి తప్పక దూరంగా ఉంచాల్సిన పనులు ఇవే..!
పాత బట్టలు ఇవ్వకూడదు:
దీపావళి రోజు పాత బట్టలు ఎవరికీ ఇవ్వడం చాలా అనర్ధకరమని చెబుతున్నారు. చాలామంది ఆ రోజు పండగ సంతోషంలో పాత బట్టలను ఇంటి పనివారికి లేదా అవసరమున్న వారికి ఇస్తారు. కానీ పండితుల మాట ప్రకారం, ఆ రోజు అలా చేయడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ చేరుతుంది. ఆర్థిక సమస్యలు, అశాంతి వంటి ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతారు.
నల్లటి వస్తువులు దూరంగా ఉంచాలి:
దీపావళి రోజున నల్లటి రంగు చాలా అశుభంగా పరిగణిస్తారు. కాబట్టి ఆ రోజు నల్లటి దుస్తులు, బూట్లు, నల్లటి రంగు వస్తువులు కొనడం లేదా ధరించడం మానుకోవాలి. నల్ల రంగు చీకటిని సూచిస్తుందని, దీపావళి అయితే వెలుగుల పండుగ కాబట్టి ఆ రోజున ఆ రంగును ఉపయోగించకపోవడమే మంచిదని పండితులు చెబుతున్నారు.
ఉప్పు దానం చేయకూడదు:
ఉప్పు అనేది జీవనానికి అత్యవసరమైనది. కానీ దీపావళి రోజున ఉప్పును ఎవరికి ఇవ్వడం లేదా దానం చేయడం లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుందట. ఇలాచేస్తే ఆ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం, శాంతి బయటకు వెళ్లిపోతుందని చెబుతారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ గొడవలు కూడా వస్తాయట.
సాయంత్రం డబ్బులు ఇవ్వకూడదు:
దీపావళి రోజు సాయంత్రం పూట ఎవరికి అయినా డబ్బులు ఇవ్వడం లక్ష్మీదేవి అనుగ్రహానికి విరుద్ధమని పండితులు చెబుతున్నారు. ఆ సమయంలో డబ్బులు ఇస్తే అది ఇంటి నుండి ధనదేవత వెళ్ళిపోవడమేనని భావిస్తారు. కాబట్టి ఆ రోజు సాయంత్రం ఎలాంటి లావాదేవీలు చేయకుండా ఉండటం ఉత్తమం.
నెయ్యి, నూనె దానం చేయకూడదు:
దీపావళి రోజున దీపాలు వెలిగించడానికి నెయ్యి లేదా నూనె ఉపయోగిస్తారు. కానీ అదే నూనె లేదా నెయ్యిని ఇతరులకు ఇవ్వడం మంచిది కాదట. అలా చేస్తే ఇంటి శుభం తగ్గి, లక్ష్మీదేవి దూరమవుతుందనే విశ్వాసం ఉంది.
దీపావళి రోజు చేయాల్సిన మంచి పనులు:
ఇంటిని పూర్తిగా శుభ్రపరచి, తలుపు ముందు రంగవల్లి వేయాలి. సాయంత్రం దీపాలతో ఇంటిని వెలిగించాలి, ఎందుకంటే వెలుగు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది. కుటుంబ సభ్యులు కలిసికట్టుగా పూజ చేయాలి. పాజిటివ్ ఆలోచనలు, సంతోషం, శాంతి వాతావరణాన్ని నిలుపుకోవాలి.పండితుల ప్రకారం, ఇలాచేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం, సంతోషం స్థిరపడతాయి.
నోట్: ఇక్కడ అందించిన సమాచారం కొంతమంది పండితుల మరియు సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడింది. దీనిని నమ్మడం లేదా నమ్మకపోవడం పూర్తిగా పాఠకుల వ్యక్తిగత అభిప్రాయం. ప్రతి ఒక్కరూ తమ విశ్వాసం, ఆచారం ప్రకారం దీపావళిని సంతోషంగా జరుపుకోవచ్చు.