గత కొన్ని రోజుల నుంచి టీం ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కు సంబంధించిన టాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే.  ముఖ్యంగా ఎంతోమంది మాజీలు రోహిత్ శర్మ గురించి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఒక మ్యాచ్లో తొడ కండరాలు పట్టేసి గాయం బారిన పడిన రోహిత్ శర్మ ఆ తర్వాత కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇక ఆ తర్వాత మళ్లీ ఐపీఎల్లో జట్టులోకి పునరాగమనం చేసి అద్భుతంగా రాణించాడు. కానీ ఆస్ట్రేలియా పర్యటనలో మాత్రం భారత జట్టులో మొదట తాను సంపాదించుకోలేక పోయాడు.


 ఇక దీనితో బీసిసిఐ పై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఎట్టకేలకు వెనక్కి తగ్గిన బీసీసీఐ రోహిత్ శర్మను టెస్ట్ సిరీస్కు ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక టెస్ట్ సిరీస్ లకు ఎంపిక చేసినప్పటికీ  ప్రస్తుతం రోహిత్ శర్మ ఏ  స్థానంలో బ్యాటింగ్ చేయబోతున్నాడు అనే దానిపై సరికొత్త చర్చ మొదలయింది. దీంతో ఎంతో మంది మాజీ లు సైతం రోహిత్ శర్మ ఏ  స్థానంలో బరిలోకి దిగబోతున్నాడు  అనే దాని పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్లో తాను ఏ స్థానంలో బ్యాటింగ్కు దిగాలి  అన్న దానిపై రోహిత్ శర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ లో  తాను ఏ స్థానంలో బ్యాటింగ్కు దిగితాను  అన్న విషయంలో తనకు కూడా క్లారిటీ లేదని... కానీ ఏ స్థానంలో ఆడటానికి అయినా తాను సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు రోహిత్ శర్మ. గతంలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాను  అంటూ చెప్పుకొచ్చాడు. బీసీసీఐ  తనను ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు పంపినప్పటికీ తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. ఏ  స్థానంలో అయినా  బ్యాటింగ్కు దిగి  జట్టు విజయానికి కృషి చేస్తాను అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా ఎంతో మంది మాజీ క్రికెటర్లు రోహిత్ శర్మను టెస్ట్ క్రికెట్లో ఓపెనర్గా బరిలోకి దింపితే బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: