ఆస్ట్రేలియా-ఇండియా మధ్య జరుగుతున్న ప్రతిష్ఠాత్మక సిరీస్‌లో డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ లేకపోవడం అభిమానులు
మండిపడుతున్నారు. అంతకన్నా రోహిత్‌ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని బీసీసీఐ ఇప్పటివరకు బయటపెట్టకపోవడం వారి కోపాన్ని మరింత పెంచింది. చివరకు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా రోహిత్ విషయంలో స్పందించాడు.
రోహిత్ ఎందుకు ఎంపిక కాలేదో తమకు తెలియదని, అంతా అయోమయంగా ఉందని చెప్పుకొచ్చాడు. దీంతో బీసీసీఐ ఎట్టకేలకు అసలు విషయాన్ని బయటపెట్టింది. రోహిత్‌ను ఎందుకు ఎంపిక చేయలేదో చెప్పి గందరగోళానికి తెర దించింది.

రోహిత్ శర్మ తండ్రి ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయన దగ్గర
రోహిత్ ఉండాలనుకున్నాడని, అందుకే అతడిని ఎంపిక చేయలేదని క్లారిటీ
ఇచ్చింది. రోహిత్ విషయంలో కోహ్లీ మాట్లాడడం, మరుసటి రోజే ఈ విషయంపై బీసీసీఐ క్లారిటీ ఇవ్వడం కొంత అనుమానాలకు తావిస్తున్నా.. అభిమానులు మాత్రం కొంత కుదుటపడ్డారు.

బీసీసీఐ క్రికెట్‌ ఆపరేషన్స్‌ టీమ్‌ కారణంగానే రోహిత్‌ విషయంలో ఇంత
గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ విభాగం రోహిత్‌ గురించి సరైన
సమాచారాన్ని బోర్డుతో పాటు కెప్టెన్‌ కోహ్లీకి కూడా చేరవేయలేదని బీసీసీఐ
చెబుతోంది. ఏదేమైనా.. రోహిత్‌ ఫిట్‌గా తేలితే అతడికి ఆసిస్‌లో 14 రోజుల
క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)ను బీసీసీఐ చీఫ్‌ గంగూలీ విజ్ఞప్తి చేసే అవకాశం కూడా లేకపోలేదు.


అలాగే.. ప్రస్తుతం ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌లో ఉన్న రోహిత్‌ ఫిట్‌నెస్‌ను
వచ్చేనెల 11న పరీక్షిస్తామని బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించాడు.
రోహిత్ టెస్టులకు అందుబాటులో ఉంటాడా లేదా అన్నదానిపై అప్పుడే నిర్ణయం
తీసుకుంటామని, ఇప్పుడేం చెప్పలేమని ఆయనన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ
ప్రకటన విడుదల చేశారు. అయితే  సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ మాత్రం
ఆసీస్‌ టూర్‌కు దూరమైనట్లేనని జైషా తెలిపారు. టెస్టు సిరీస్‌ మొదలయ్యే
(వచ్చేనెల 17) నాటికల్లా అతను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండకపోవచ్చని.. అందుకే
సిరీస్‌ నుంచి అతడిని తప్పించక తప్పలేదని వెల్లడించారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం జట్టుతోపాటు ఉన్న నవ్‌దీప్‌ సైనీ వెన్నునొప్పితో
బాధపడుతుండడతో అతడికి జట్టు యాజమాన్యం రెస్ట్ ఇచ్చింది. అతడి స్థానంలో నటరాజన్‌కు స్థానం కల్పిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున నటరాజన్‌ను అద్భుతంగా రాణించాడు. ఇప్పుడు టీంఇండియా
తరపున వన్డే జట్టులోకి ఎంపికయ్యాడు. మరి ఆసిస్ గడ్డపై నటరాజన్ ఏ స్థాయిలో రాణిస్తాడో వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: