ప్రస్తుతం భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య సొంత గడ్డపై టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇరు జట్లు కూడా హోరాహోరీగా తలబడుతున్నాయి. ఇక ఇప్పటి వరకు మూడు టెస్ట్ మ్యాచ్ లు  జరగగా మూడు టెస్ట్ మ్యాచ్ లలో   రెండింటిలో గెలిచి ప్రస్తుతం భారత్ ఆధిపత్యం కొనసాగిస్తుంది అని చెప్పాలి.  మొదటి టెస్టు మ్యాచ్ లో ఓడిపోయిన భారత జట్టు తర్వాత పుంజుకొని వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్లలో విజయం సాధించింది. ఇకపోతే ఇటీవలే మూడవ టెస్ట్ మ్యాచ్ లో పోటీ ఎంతో రసవత్తరంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.


 భారత బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లను ముప్పుతిప్పలు పెట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అతి తక్కువ పరుగులకు కట్టడి చేయడంలో విజయం సాధించి.. వెంటవెంటనే వికెట్లు పడగొట్టింది భారత బౌలింగ్ విభాగం. ఈ క్రమంలోనే భారత జట్టు మూడో టెస్ట్ మ్యాచ్లో కూడా ఘన విజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అతి పెద్దదైన అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియం వేదికగా మూడవ టెస్ట్ మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో ఓటమి తర్వాత ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్  అందరూ మొతేరా స్టేడియం లోని పిచ్ పై విమర్శలు చేస్తున్నారు.




 పిచ్ సరిగాలేదని టెస్ట్ క్రికెట్ కు సరైనది కాదు అంటూ విమర్శలు చేస్తున్న వేల స్పందించిన విరాట్ కోహ్లీ..  పిచ్  సరిగానే ఉంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా  విరాట్ కోహ్లీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ అలిస్టర్ కుక్. తొలి ఇన్నింగ్స్ లో  పిచ్ బ్యాటింగ్ కి అనుకూలించింది అని కోహ్లీ  చేసిన కోహ్లీ వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పు.. మా జట్టులో స్పిన్  ఎదుర్కోగల ఆటగాళ్ళు ఉన్నారు.. కానీ ఎదుర్కోలేక పోయారు. బంతి ఎక్కువగా స్కిడ్  అవుతున్నప్పుడు పింక్ బంతి లో ఏమైనా తేడా ఉందా అని గమనించాలి.. పిచ్ పై  బంతి ఎక్కువగా టర్న్  అయింది అంటూ అలిస్టర్ కుక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: