భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇటీవల ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభం అయింది. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లలో భాగంగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక గత ఏడాది పేలవా ప్రదర్శన చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈసారి మాత్రం అద్భుతంగా పుంజుకుని రాణిస్తుంది అని అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ అందరి ఆశలను అడియాశలు గా మిగిల్చింది.



 ముఖ్యంగా ధోని ఎంతో అద్భుతంగా రాణిస్తాడని చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధిస్తుంది అని అటు ప్రేక్షకులు భావించారు. ఎందుకంటే మరోవైపు ఎలాంటి అనుభవం లేని రిషబ్ పంత్ కెప్టెన్ గా ఉండడం కూడా దీనికి ఒక కారణం. అయితే 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచినప్పటికీ ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పూర్తిగా విఫలం అయింది అని చెప్పాలి. మహేంద్ర సింగ్ ధోనీ వ్యూహాలు ఎక్కడ ఫలించలేదు. చివరికి యువ ఆటగాళ్ల చేతిలో దిగ్గజ ఆటగాళ్లతో కూడిన చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడిపోయింది.



 ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది అని అటు అభిమానులు అందరూ కూడా నిరాశ లో మునిగిపోయారు. మహేంద్రసింగ్ ధోని ఎంతో అద్భుతంగా రాణించి చెన్నై సూపర్ కింగ్స్ ను గెలిపిస్తాడు అనుకుంటే ఒక్క పరుగు కూడా చేయకుండానే ఔటయ్యి వెనుతిరిగటం అభిమానులను ఎంతో నిరాశ పరిచింది. అయితే ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ షాక్ తగిలింది. ఇక ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కు మరో షాక్ తగిలింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత సమయంలో  ఓవర్లను పూర్తి చేయలేదు. దీంతో స్లో ఓవర్ రేట్ కారణంగా మహేంద్రసింగ్ ధోని 12 లక్షలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది.  ఇలా ఓటమితో పాటు చెన్నై కి మరో షాక్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: