ప్రపంచవ్యాప్తంగా  ఫుట్బాల్ ఆట కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోందంటే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా యూరో కప్ ఫుట్బాల్  జరుగుతుంది. అయితే కొన్ని కొన్ని సార్లు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఊహించని ఘటనలు చోటు చేసుకొని ఆటగాళ్లను మరోవైపు ప్రేక్షకులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. సాధారణంగా గోల్ కీపర్ ఏం చేయాలి  ప్రత్యర్థి ఆటగాళ్లు గోల్ చేసిన సమయంలో.. బంతి  గోల్ లోకి వెళ్లకుండా ఆపాలి.



ఏ గోల్ కీపర్ అయిన ఇదే చేస్తూ ఉంటారు.  కానీ ఇక్కడ ఒక గోల్ కీపర్ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. స్వయంగా గోల్ చేసి ఆశ్చర్యపరిచాడు గోల్ కీపర్.  ఉత్కంఠ భరితంగా సాగిన ఫుట్బాల్ మ్యాచ్లో విజయం దక్కినప్పటికీ ఆ గోల్ కీపర్ కి మాత్రం ఈ మ్యాచ్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇటీవలే యూరో కప్ లో స్పెయిన్ క్రొయేషియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అయితే ఇక 1-0 తేడాతో క్రొయేషియా  ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే గోల్ కీపర్ చేసిన పొరపాటు ఏకంగా జట్టును అయోమయంలో పడేసింది. మిడ్ ఫీల్డర్ ఫెడ్రి బంతిని పాస్ చేయగా అది గోల్ కీపర్ సైమన్ ముందుకు వచ్చింది. అయితే తన ముందుకు వచ్చిన బంతిని కాలితో ఎంతో స్టైల్ గా అడ్డుకోవాలి అనుకున్నాడు గోల్ కీపర్  .



 కానీ ఏం చేస్తాం ఆ బంతి కాస్త అతని షూ చివరను తగిలి వెనకాల ఉన్న గోల్ వైపు దూసుకు వెళ్ళింది. ఇదంతా రెప్పపాటులో జరిగిపోవడంతో ఇక గోల్ కీపర్ బంతినిఆపే సమయం కూడా లేకుండా పోయింది. దీంతో ఇక గోల్ కీపర్ సైమన్ నిరాశలో మునిగిపోయాడు. తన వల్ల జట్టు క్లిష్టపరిస్థితుల్లో పడింది అనుకున్నాడు. ఇక మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఇక ఈ నిరాశ అతనిలో కనిపించింది. ఇక చివరికి 5-3 తేడాతో స్పెయిన్ క్రొయేషియా జట్టుపై విజయం సాధించింది ఇక ఈ వెరైటీ గోల్డ్ కి సంబంధించిన వీడియో  కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఫుట్బాల్ చరిత్రలోనే ఇదొక వెరైటీ గోల్ అంటూ ఎంతో మంది కామెంట్లు సైతం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: