ఇటీవలే ఎంతో ప్రతిష్టాత్మకంగా జపాన్ ప్రభుత్వం టోక్యో ఒలంపిక్స్ ప్రారంభమైంది. అయితే నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ టోక్యో ఒలంపిక్స్ ఈసారి కాస్త ఆలస్యంగానే ప్రారంభం అయ్యాయి అని చెప్పాలి. కరోనా వైరస్ కారణంగా గత ఏడాది జరగాల్సిన టోక్యో ఒలంపిక్స్ ఈ ఏడాది ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ కఠిన ఆంక్షలు మధ్య జపాన్ ప్రభుత్వం ప్రస్తుతం టోక్యో ఒలంపిక్స్ నిర్వహిస్తోంది.  ఈ క్రమంలోనే ఒలంపిక్స్ నేపథ్యంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ విదిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది జపాన్ ప్రభుత్వం. అన్ని దేశాలకు చెందిన క్రీడాకారులు ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు.


 కాగా ఇక ఎన్నో ఏళ్ల నుంచి ఒలింపిక్స్లో పతకాలకి దూరంగా ఉన్నా దేశాలు ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లో బంగారు పతకాలను సాధించి గౌరవాన్ని నిలబెట్టుకోవాలి అని ప్రస్తుతం ఎంతగానో ఆశ పడుతున్నాయి. కాగా ప్రస్తుతం ఎంతో హోరాహోరీగా జరుగుతున్న ఒలంపిక్స్ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు కూడా సత్తా చాటుతూ గోల్డ్ మెడల్ సాధిస్తున్నారు. ఇక ఈ ఒలింపిక్స్ లో యువ ప్రతిభా ఎక్కువగా సత్తా చాటుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక ఇటీవలే ఒక దేశం యొక్క 97 ఏళ్ల నిరీక్షణ కు ఇటీవలే ఒలంపిక్స్  లో తెరపడింది.


 97 ఏళ్ల నుంచి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ అనే పదానికి దూరమైన ఆ దేశానికి ఇటీవలే గోల్డ్ మెడల్ వరించింది.  దీంతో ఆ దేశ ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మహిళా వెయిట్ లిఫ్టర్ హిదిలిన్ దియాత్ ఇటీవలే వెయిట్ లిఫ్టింగ్ లో ఏకంగా 97ఏళ్ల తర్వాత ఫిలిఫైన్స్ దేశానికి గోల్డ్మెడల్ సాధించి పెట్టింది. యాభై ఐదు కేజీల విభాగంలో 30 ఏళ్ల దియాజ్ ఏకంగా 212 కేజీల బరువులు ఎత్తి మొదటి స్థానంలో నిలిచి ఇక స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. కాగా 1924 నుంచి ఒలింపిక్స్ లో పాల్గొంటుంది ఫిలిప్పైన్స్. కానీ ప్రతి ఒలంపిక్స్లో కూడా ఇప్పటివరకు నిరాశే ఎదురవుతుంది. ఒక్కసారి కూడా గోల్డ్ మెడల్ సాధించలేక పోయింది. కానీ 97 ఏళ్ల తర్వాత ఇక ఇప్పుడు గోల్డ్ మెడల్ సాధించింది ఫిలిప్పైన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: