విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మ ప్రస్తుతం టీమిండియా లో ఎంత కీలకమైన ఆటగాళ్ళో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  టీమిండియా ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతూ అద్భుతమైన విజయాలు సాధిస్తూ ప్రస్తుతం టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది అంటే అందుకు వీరిద్దరే కారణం అని చెప్పాలి. ప్రస్తుతం విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్గా కొనసాగుతుండగా రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నారు. అయితే టీమ్ ఇండియా లో కీలక ఆటగాళ్లు అయిన ఈ వీరిద్దరి మధ్య గత కొన్ని రోజుల నుంచి కోల్డ్ వార్ నడుస్తోంది.


 ఇక వీరిద్దరి మధ్య నడుస్తున్న అంతర్గత యుద్ధం గురించి అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.  అయితే వీరిద్దరి మధ్య ఉన్న వివాదం గురించి ఇప్పటి వరకు ఎక్కడా సోషల్ మీడియాలో వీళ్లు స్వయంగా స్పందించింది లేదు. కానీ ఇద్దరు ఆటగాళ్ళు ఒకరిపట్ల ఒకరు ప్రవర్తించే తీరు మాత్రం అభిమానులందరికీ వీరి మధ్య వివాదం నడుస్తోంది అన్న దానిపై క్లారిటీ ఇచ్చింది. అయితే బిసిసిఐ వీరిద్దరి మధ్య వివాదం సద్దుమణిగింది అని పలుమార్లు చెప్పినప్పటికీ వీరు చేసే పనులు మాత్రం ప్రేక్షకులు నమ్మకాన్ని కలిగించలేదు.



 ఇకపోతే ఇటీవలే కెప్టెన్ విరాట్ కోహ్లీ బీసీసీఐ ముందుకు ఒక అనూహ్యమైన ప్రపోజల్ తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. సెలక్షన్ కమిటీ తో ఇటీవలే టి20 వరల్డ్ కప్ జట్టు ఎంపిక పై మాట్లాడిన విరాట్ కోహ్లీ.. అదే సమయంలో వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించాలి అంటూ బిసిసిఐ ముందు ప్రతిపాదించాడట.  టి 20 క్రికెట్ అంటే కుర్రాల్లా క్రికెట్ అని అలాంటి ఫార్మాట్లో 34 ఏళ్ళ రోహిత్ ను  వైస్ కెప్టెన్గా తొలగించి యువకులకు అవకాశం ఇవ్వాలని సెలెక్షన్ కమిటీని కోరినట్లు తెలుస్తోంది. ఇక కోహ్లీ ప్రతిపాదనతో సెలక్షన్ కమిటీ కూడా ఆశ్చర్యపోయారట  ఇలా రోహిత్ శర్మ ఏకంగా కోహ్లీ వైస్ కెప్టెన్సికే ఎసరు పెట్టేందుకు సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో సెలక్షన్ కమిటీ కోహ్లీనీ కెప్టెన్సీ నుంచి తప్పించాలని భావించారట  అందుకే  ఇది ముందుగానే గ్రహించిన కోహ్లీ గౌరవంగా తానే తప్పుకుంటాను అంటూ ప్రకటించినట్లు టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: