బీసీసీఐ ప్రతియేడాది నిర్వహించే ఐపీఎల్ లో అతి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన జట్టు ఏది అంటే అందరూ టక్కున చెప్పే పేరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ముందుకు సాగిన ఈ జట్టు ఇప్పటివరకు ఒక్క సారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. కానీ ఎంతోమంది అభిమానుల ప్రేమను మాత్రం సంపాదించుకుంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక ఆటగాడిగా కెప్టెన్ కోహ్లి కి అత్యంత సన్నిహితుడిగా కొనసాగాడు ఏబీ డివిలియర్స్. గతంలోనే తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఎబి డివిలియర్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో మాత్రం కీలక ఆటగాడిగా కొనసాగాడు.


 ఏకంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో ఆటగాళ్లు అందరితో కూడా ఎంతో సన్నిహితంగా ఉంటాడు. అయితే తన క్రికెట్ కెరీర్కు పూర్తిగా అన్ని ఫార్మాట్లలో కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతోఎంతోమంది అభిమానులు నిరాశ లో మునిగిపోయారు. ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫాన్స్ అయితే అవాక్కయ్యారు. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. ఇప్పుడు జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న ఎబి డివిలియర్స్ పూర్తిగా రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో అందరూ షాక్ అవుతున్నారు.


 అయితే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫాన్స్ అందరి కోసం ఒక వీడియో ని విడుదల చేశాడు. నేను జీవితాంతం ఆర్సిబీయన్ గా ఉండబోతున్న అంటూ చెప్పుకొచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టులోని ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులు గా మారిపోయారు. ఎంతో మంది వస్తారు వెళ్ళిపోతారు కానీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో మన మధ్య ఉన్న అనుబంధం ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటాయి. నేను ఇప్పుడు సగం భారతీయుడిని అయినందుకు ఎంతగానో సంతోషపడుతున్నా అంటూ ఒక వీడియో ని విడుదల చేసాడు ఎబి డివిలియర్స్..

మరింత సమాచారం తెలుసుకోండి: