భారత్ పాకిస్తాన్ మధ్య ఎన్నో ఏళ్ల నుంచి వైరం కొనసాగుతోంది. భారత దాయాది దేశం గా కొనసాగుతుంది పాకిస్తాన్.  కేవలం రాజకీయంగా మాత్రమే కాదు క్రీడల్లో కూడా ఈ వైరం కొనసాగుతూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే   భారత జట్టు పాకిస్థాన్లో పర్యటించటం పూర్తిగా రద్దు చేసుకుంది. ఐసీసీ టోర్నీలో తప్ప పాకిస్థాన్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడదు భారత జట్టు.. అదే సమయంలో ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కూడా పాకిస్థాన్ ఆటగాళ్లకు అవకాశం కల్పించడం లేదు. అయితే కేవలం ఒక క్రికెట్లో మాత్రమే కాదు అన్ని రకాల ఆటల్లోనూ ఇలాంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇటీవలే జూనియర్ హాకీ ప్రపంచ కప్ లో అటు భారత్ వేదికగా జరుగుతుంది. అయితే ఈ ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు ఇటీవల పాకిస్థాన్ జూనియర్ హాకీ జట్టు భారత్లో అడుగు పెట్టింది.


 ఒడిషాలోని భువనేశ్వరి వేదికగా నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు జూనియర్ హాకీ ప్రపంచ కప్ జరగబోతుంది. జూనియర్ హాకీ పాకిస్తాన్ జట్టు భారత్లో అడుగు పెట్టగా పాకిస్తాన్ హై కమిషన్ ఇన్ఛార్జ్ అఫ్తాబ్ ఖాన్ జట్టు ఆటగాళ్ళకు ఘన స్వాగతం పలికారు. కాగా డిఫెండింగ్ చాంపియన్ భారత్ నవంబర్ 24వ తేదీన ఫ్రాన్స్ తో ప్రపంచకప్ ప్రారంభించబోతుంది. ఇక ప్రస్తుతం ఇక ఈ ప్రపంచ కప్ లో జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. పాకిస్తాన్ జట్టు గ్రూప్ డి లో కొనసాగుతోంది.అయితే ఇలా హాకీ ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు వచ్చిన జట్ల ఆటగాళ్లకు 72 గంటలకు ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు తప్పక చేయించుకుంటారని క్రీడా విభాగం అధికారులు తెలుపుతున్నారు. ఈ అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ను ఎంతో సురక్షితంగా జరిపేందుకు తాము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాట్లు అంటూ అధికారులు చెబుతున్నారు.. వరల్డ్ కప్ లో విజయం సాధించాలని ఒక పెద్ద కలతో ఇక్కడికి వస్తున్న ఎంతోమంది జూనియర్ హాకీ క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాము అన్ని ఏర్పాట్లు చేశాము అంటూ చెప్పుకొచ్చారు అధికారులు. అయితే ఇక జూనియర్ హాకీ ప్రపంచ కప్లో భాగంగా పాకిస్థాన్ జూనియర్ హాకీ జట్టు వేగంగా భారత్లో అడుగు పెట్టడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: