ఇకపోతే ఇటీవల పాకిస్తాన్ వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో టి20 మ్యాచ్ లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.. వెస్టిండీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాకిస్థాన్ బౌలర్ మహమ్మద్ వసీం తన ఓవర్లో బ్యాట్స్మెన్ భారీ సిక్సర్ కొట్టడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇక అదే కోపంతో ఆ తర్వాత తనదైన శైలిలో ప్రతీకారం తీర్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అసలేం జరిగిందంటే మూడో టి20 మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్న వెస్టిండీస్ జట్టు పవర్ ప్లే లో బౌండరీలు సిక్సర్ల మోత మోగిస్తూ ఎంతో దూకుడుగా ఆడుతూ ఉంది.
ఇక పవర్ ప్లే లో ఆఖరి ఓవర్ను మహమ్మద్ వసీం బౌలింగ్ వేసాడు. అప్పటికే 43 పరుగులతో ఎంతో దూకుడుగా ఆడుతున్నాడు వెస్ట్ఇండీస్ బ్యాట్స్మెన్ బ్రాండెడ్ స్టార్క్. ఈ క్రమంలోనే వసీం వేసిన బంతిని భారీ సిక్సర్ గా మలిచాడు. అయితే తన ఓవర్లో బ్యాట్స్మెన్ సిక్సర్ కొట్టడంతో కోపంతో ఊగిపోయాడు బౌలర్. ఇక ఆ తర్వాత బంతికే తనదైన శైలిలో రివెంజ్ తీర్చుకున్నాడు. ఇక తర్వాత బంతికే వికెట్ తీసుకొని దెబ్బకుదెబ్బ అన్నట్లుగా ప్రతీకారం తీర్చుకున్నాడు. బంతిని భారీ షాట్ ఆడాలి అనుకొని వెనక్కి జరిగాడు బ్యాట్స్మెన్. దీంతో బంతి బ్యాట్ కి మిస్ అయ్యి వికెట్లను ఎగరగొట్టింది. ఇక ఆ తర్వాత తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు మహమ్మద్ వసీం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి