ఇండియా అంతర్జాతీయ జట్టులో అవకాశం దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక ఆటగాడు మైదానంలోకి దిగిన ప్రతిసారి సింహంలా గర్జిస్తున్నాడు. భారీగా పరుగులు చేస్తూ స్కోర్ బోర్డు ను సైతం భయపెడుతున్నాడు. బౌలర్ ఎవరైనా పరుగుల వరద పారిస్తున్నాడు.ఇప్పటికే వెంకటేష్ అయ్యర్, రూతురాజ్ గైక్వాడ్ లాంటి యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించి సెంచరీలతో అదరగొట్టారు. ఇప్పుడు మరో యువ ఆటగాడు తెరమీదికి వచ్చేసాడు. ఇటీవలే కర్ణాటక రాజస్థాన్ జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భాగంగా నిర్ణీత 41.3 ఓవర్లలో 200 ఆలౌటయింది రాజస్థాన్ జట్టు.
అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే జట్టులోని ఆటగాళ్లు అందరూ కలిసి 200 పరుగులు చేస్తే ఇక ఇందులో 109 పరుగులు జట్టు కెప్టెన్ దీపక్ కూడా ఒక్కడే చేయడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే అటు రాజస్థాన్ బ్యాటింగ్ వైఫల్యం ఏ రేంజిలో ఉంది అన్నది స్పష్టంగా తెలుస్తోంది. దీపక్ హుడా తర్వాత సమర్పిత్ జోషీ మాత్రమే రాణించాడు.. 33 పరుగులు చేశాడు.ఇక మిగతా అందరు బ్యాట్స్మెన్లు కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం గమనార్హం. ఇకపోతే ఇటీవల సెంచరీతో అదరగొట్టిన దీపక్ హుడా కూడా సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. అయితే ఇలా వరుసగా యువ ఆటగాళ్లను అద్భుతంగా రాణిస్తూ ఉండడం తో కలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారిపోతుంది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి