ఇక్కడ ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. ప్రస్తుతం టీమిండియా దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ఆడుతుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. టీమ్ ఇండియా బౌలింగ్ విభాగంలో మహమ్మద్ సిరాజ్ ఎంతో కీలకం గా మారిపోయాడు. ఎంతో పదునైన బంతులను సంధిస్తూ ఆటగాళ్లను తికమక పెట్టి వికెట్లను తీసుకున్నాడు. ఇకపోతే ఇటీవలే మొదటి టెస్ట్ 5వ రోజు ఆటలో సిరాజ్ వ్యవహరించిన తీరు కాస్త అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ తెంబ బావుమా పాదాల పైకి సిరాజ్ బంతిని ఎంతో వేగంగా విసిరాడు.
ఇలా సిరాజ్ ఎంతో బలంగా విసిరిన బంతి నేరుగా వెళ్లి బ్యాటర్ పాదాలకు తాకడంతో నొప్పితో విలవిలలాడి పోయాడు సౌత్ ఆఫ్రికా బ్యాటర్ తెంబ బావుమా. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లోని 62 ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనపై ఇటీవలే టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తెంబ బావుమా పరుగులు తీసేందుకు ఎలాంటి ప్రయత్నం కూడా చేయలేదని అప్పుడు సిరాజ్ బంతిని బ్యాటర్ పైకి విసరాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ ప్రశ్నించాడు. ఎవరైనా వెళ్లి సిరాతో అతని దూకుడు గురించి మాట్లాడాలి అంటూ సునీల్ గవాస్కర్ సూచించాడు. బంతి విసరాల్సిన అవసరం కచ్చితంగా లేదు అంటూ చెప్పుకొచ్చాడు సన్నీ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి